Begin typing your search above and press return to search.
అన్నీతెలుసనుకుంటే అవివేకం స్పందిస్తే సంతోషం
By: Tupaki Desk | 27 Aug 2015 2:35 AM GMTకాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా కాశ్మీర్ పర్యటనలో ఉన్నారు. అప్రకటిత కాల్పులకు తెగబడుతున్న పాక్ వైఖరి వల్ల... కాశ్మీర్ ప్రజలు పడుతున్న ఇబ్బందులు, జరుగుతున్న దారుణాలపై ప్రజలతో మాట్లాడారు. అనంతరం ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. భారత్ మెతక వైఖరి వల్ల పాక్ ఎన్నడూ లేని విదంగా అప్రకటిత కాల్పుల ఒప్పందాన్ని మీరుతుందని.. దీంతో కాశ్మీర్ ప్రజలు భయబ్రాంతులతో బ్రతుకీడుస్తున్నారని.. ఇన్ని జరుగుతున్నా మోడీ నోరు మెదపడం లేదని.. ఇది ఆయన చేతగానితనం కాదా అని ప్రశ్నిస్తున్నారు.
ఇదే సమయంలో పాక్ కాల్పుల్లో గాయపడిన కుటుంబాలను రాహుల్ పరామర్శించారు. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని వీరి జీవితాలకు బీమా సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వం ఆలోచించాలని రాహుల్ సూచించారు. ఏది అడిగినా... అన్నీ తెలుసన్నట్లు చెబుతారని... తనకు అన్నీ తెలుసు అని అనుకుంటే అది కేవలం అవివేకం తప్ప మరొకటి కాదని... ఇది ప్రధానికి పుష్కలంగా ఉందని రాహుల్ మండిపడ్డారు. మోడీ ఏదో చేస్తారు.. ఏదోచేస్తారు అని ఆలోచించుకుంటూనే సంవత్సర కాలం దాటిపోయిందని... మాట తప్పడంలో మోడీ నిష్ణాతుడైపోతున్నారని రాహుల్ నిప్పులు చెరిగారు!
కాగా... రోజు రోజుకీ మితిమీరిపోతున్న పాక్ కాల్పుల ఉల్లంఘన, దావూద్ కు ఆశ్రయం కల్పించి పక్కలో పెట్టుకోవడం వంటి విషయాలపై మోడీ స్పందించాల్సిన అవసరం ఉంది... ఇప్పటికైనా స్పందిస్తే సంతోషిస్తామని పలువురు అభిప్రాయపడుతున్నారు!