Begin typing your search above and press return to search.

మ‌న్మ‌ధుడు మూవీని గుర్తు చేసిన రాహుల్‌

By:  Tupaki Desk   |   9 Jun 2017 4:13 AM GMT
మ‌న్మ‌ధుడు మూవీని గుర్తు చేసిన రాహుల్‌
X
మ‌న్మ‌ధుడి సినిమాకు.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి సంబంధం ఏమిటి? అస‌లు ఈ రెండింటి మ‌ధ్య పోలికేంద‌న్న డౌట్ రావొచ్చు. తాజాగా మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని మంద్ సౌర్ లో రైతుల‌పై జ‌రిపిన కాల్పుల నేప‌థ్యంలో అన్న‌దాత‌ల్ని ప‌రామ‌ర్శించేందుకు రాహుల్ వెళ్ల‌టం తెలిసిందే.

ఇంత సీరియ‌స్ ఉదంతంలో సంబంధం లేని సినిమా ప్ర‌స్తావ‌న ఏంద‌ని అనుకోవ‌చ్చు. కానీ.. విష‌యం అలాంటిది. నాగార్జున గ‌తంలో న‌టించిన మ‌న్మ‌ధుడు సినిమా క్లైమాక్స్ చూస్తే.. హీరోయిన్ కోసం కారులో బ‌య‌లుదేరి.. ర‌క‌ర‌కాల ప్ర‌యాణ సాధ‌నాల్లో ప్ర‌యాణిస్తాడు. తాజాగా రైతుల్ని క‌లిసేందుకు మంద్ సౌర్‌ కు వెళ్లే ప్ర‌య‌త్నంలో రాహుల్ కూడా ఇదే తీరులో వ్య‌వ‌హ‌రించ‌టం క‌నిపిస్తుంది.

రైతుల ప‌రామ‌ర్శ‌కు ఢిల్లీ నుంచి రాజ‌స్తాన్‌ లోని ఉద‌య్‌ పూర్‌ కు చార్ట‌డ్ ఫ్లైట్‌ లో వ‌చ్చారు రాహుల్‌. అక్క‌డి నుంచి మ‌ధ్య‌ప్ర‌దేశ్ స‌రిహ‌ద్దుల్లోని చిత్తోడ్ గ‌ఢ్ వ‌ర‌కు రోడ్డు మార్గంలో కారులో ప్ర‌యాణించారు. మ‌ధ్య‌లో ఒక డాబా ద‌గ్గ‌ర ఆగిన రాహుల్‌.. త‌ర్వాత మోటార్ సైకిల్ మీద దాదాపు ఐదారు కిలోమీట‌ర్లు ప్ర‌యాణించి స‌రిహ‌ద్దుకు చేరుకున్నారు. అక్క‌డి నుంచి వంద మీట‌ర్లు కాలిన‌డ‌క‌తో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ లోకి చేరుకున్నారు.

ఇదిలా ఉంటే.. రాహుల్ తో క‌లిసి మోటార్ బైకు మీద వెళ్లిన ఉదంతం వివాదంగా మారింది. మోటార్ సైకిల్ మీద ఎలాంటి రిజిస్ట్రేష‌న్ లేకుండా ఉండ‌టం.. నెంబ‌రు ప్లైట్ లేని వాహ‌నం మీద ప్ర‌యాణించ‌టం ఒక ఎత్తు అయితే.. రాహుల్ ప్ర‌యాణించిన బైక్ ను న‌డిపిన వ్య‌క్తి హెల్మెట్ లేకుండా ప్ర‌యాణించ‌టంపై ప‌లు విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఇలా ఎలా ప్ర‌యాణిస్తార‌ని బీజేపీ నేత‌లు రాహుల్ ను త‌ప్పు ప‌డుతున్నారు. ఇదిలా ఉంటే..రాహుల్ తో పాటు మూడు బైకులు వెళ్లాయ‌ని.. వేటికీ నెంబ‌రుప్లేట్లు లేవ‌ని చెబుతున్నారు. దీనిపై స్పందించిన రాజ‌స్తాన్ పోలీసులు ఈ అంశంపై విచార‌ణ జ‌రిపి చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఫ్లైట్ తో మొద‌లైన రాహుల్ ప్ర‌యాణం చివ‌ర‌కు కాలి న‌డ‌క వ‌ర‌కూ సాగ‌టం ఒక ఎత్తు అయితే.. రైతుల్ని క‌లుసుకునే విష‌యంలో అభ్యంత‌రాలు వ్య‌క్తం చేసి ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. నాలుగు గంట‌ల పాటు ఒక కంపెనీ గెస్ట్ హౌస్ లో రాహుల్‌ ను ఉంచిన అనంత‌రం.. కొద్దిసేపు రైతుల్ని క‌లుసుకునేందుకు అనుమ‌తించారు. రైతుల్ని రాహుల్ క‌లిసే విష‌యంలో హైడ్రామా న‌డిపిన పోలీసులు.. చివ‌ర‌కు రైతుల్ని క‌లిసేందుకు అనుమ‌తించ‌టం గ‌మ‌నార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/