Begin typing your search above and press return to search.
ఆ 7 వేల కోట్లు నల్లధనం కాదా..రాహుల్ ప్రశ్న!
By: Tupaki Desk | 29 Jun 2018 3:21 PM GMTప్రధాని నరేంద్ర మోదీ....2014 ఎన్నికలకు ముందు ఇబ్బడి ముబ్బడిగా హామీలు గుప్పించిన సంగతి తెలిసిందే. స్విస్ బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయల నల్ల ధనం మూలుగుతోందని, దానిని వెనక్కు రప్పించి ప్రతి భారతీయుడి ఖాతాలో 15లక్షల రూపాయలు వేస్తానని ప్రగల్భాలు పలికారు. అంతేకాక, 2016లో పెద్ద నోట్ల రద్దు ద్వారా అసలు దేశంలో నల్లధనం ఉండదని గప్పాలు కొట్టారు. అయితే, ఆ పెద్దనోట్ల రద్దు చర్యతో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవడం తెలిసిందే. అయితే, మోదీ చెప్పినట్లు స్విస్ బ్యాంకులో నల్లధనం భారత్ కు రాకపోగా....గత ఏడాది భారత్ నుంచి డిపాజిట్లు 50 శాతం పెరిగాయి. దీంతో - స్విస్ లో భారతీయుల డిపాజిట్లు రూ 7,000 కోట్లకు చేరాయి. అయితే, ఆ డబ్బు మొత్తం నల్ల ధనమేనని ఎలా భావిస్తామంటూ ఆర్థికశాఖ ఇన్ చార్జిగా ఉన్న కేంద్ర మంత్రి పియూష్ గోయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ పై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు.
స్విస్ బ్యాంకుల్లో గత ఏడాది రూ 7,000 కోట్లను భారతీయులు డిపాజిట్ చేశారని - ఇందుకు మోదీ సర్కార్ ఏం సమాధానం చెబుతుందని రాహుల్ నిప్పులు చెరిగారు. స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనం వెనక్కు రాకపోగా, పెరగడం ఏమిటని నిలదీశారు. ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు వేస్తానన్న మోదీ హామీని గుర్తు చేశారు. నోట్ల రద్దుతో నల్లధనం ఇంకా పెరిగిందని, అదంతా స్విస్ బ్యాంకులకు చేరిందని ఎద్దేవా చేశారు. పీయూష్ వ్యాఖ్యలపై కూడా రాహుల్ మండిపడ్డారు. స్విస్ లో భారతీయుల డబ్బు అంతా నల్లధనం అని ఎలా చెబుతామని పీయూష్ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. స్విస్ లో డిపాజిట్ అయిన మొత్తంలో 40 శాతం లిబరైజ్డ్ రెమిట్టెన్స్ పథకం (ఎల్ ఆర్ ఎస్) కారణంగా వచ్చిందని గోయల్ చెప్పడంపై మండిపడ్డారు. చెప్పారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునేందుకు ....అది వైట్ మనీ అని పీయూష్ చెప్పడం ఏమిటని రాహుల్ ఎద్దేవా చేశారు.