Begin typing your search above and press return to search.
మోడీ కౌగిలి కోసం ట్రంప్ ఎదురుచూస్తున్నాడట
By: Tupaki Desk | 16 Oct 2017 5:29 AM GMTపాకిస్థాన్ కొన్ని ఏళ్ల తరబడి అమెరికా నుంచి భారీగా లబ్ధి పొందిందని - ఇప్పుడు ఆ దేశంతో అసలైన బంధం ప్రారంభమైందని అధ్యక్షుడు డొనాల్ ట్రంప్ వ్యాఖ్యానించడం - పాక్ తో సంబంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తామని చేసిన ట్వీట్ పై కలకలం ఇంకా కొనసాగుతోంది.``పాక్ తోనూ - ఆ దేశ నేతలతోనూ మరింత సత్సంబంధాల మెరుగుదల ప్రారంభమైంది. పాకిస్థాన్ బహుముఖ సహకారానికి ధన్యవాదాలు`` అని ట్రంప్ ట్వీట్ చేశారు. హక్కానీ నెట్ వర్క్ ఉగ్రవాద సంస్థ నుంచి ఓ కుటుంబాన్ని కాపాడినందుకు ట్రంప్ ఇలా ధన్యవాదాలు తెలిపారు. దీనిపై కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ పై రాహుల్ గాంధీ స్పందిస్తూ... ``మోడీజీ త్వరపడండి. ప్రెసిడెంట్ ట్రంప్ కి మరొక ఆలింగనం అవసరమేమో``.. అని అన్నారు. పాక్ విషయంలో ట్రంప్ యూ-టర్న్ తీసుకున్నారని ఆరోపిస్తూ.. మోడీ పై రాహుల్ ఇలా వ్యంగ్యాస్ర్తాన్ని విసిరారు. కాగా, అమెరికా నిఘా వర్గాలిచ్చిన సమాచారం ఆధారంగా పాక్ దళాలు హక్కానీల చెర నుంచి అమెరికన్ పౌరురాలు కెయిట్లన్ కోల్ మన్ - ఆమె భర్త కెనడా జాతీయుడు జాషువా బాయిల్ వారి ముగ్గురు పిల్లలను రక్షించాయి. ఆఫ్ఘనిస్థాన్ సందర్శనకు వచ్చిన ఈ దంపతులను 2012లో ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఉగ్రవాదుల చెరలోనే వారికి ముగ్గురు పిల్లలు పుట్టారు.
కాగా, ఇటీవల ట్రంప్ ఆఫ్ఘన్ - దక్షిణాసియా విధానాన్ని ప్రకటించినప్పుడు, ఉగ్రవాదులకు పాకిస్థాన్ మద్దతును కొనసాగిస్తున్నదని, అందుకు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాజా పరిణామాల తర్వాత ఆయన పాక్ నేతలకు కృతజ్ఞతలు తెలుపుతూ - పాక్ తో సంబంధాలు మెరుగుపడుతున్నాయని, పలు అంశాల్లో తమకు సహకారం అందిస్తున్నారని శుక్రవారం ట్వీట్ చేశారు. వారు అమెరికాను గౌరవించడం ప్రారంభించారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ తాజా సెటైర్ వేశారు.