Begin typing your search above and press return to search.
రాహుల్ నిజంగా గిన్నిస్ రికార్డు సాధించారా?
By: Tupaki Desk | 21 March 2017 11:20 AM GMTగ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీకి ప్రస్తుతం ఏ ఒక్క అంశం కూడా కలిసి వస్తున్నట్లుగా లేదు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన మంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయనకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. యువరక్తంతో ఉరకలెత్తుతున్న రాహుల్ నేతృత్వంలో పార్టీ కూడా సంచలన విజయాలు సాధిస్తుందన్న ఆ పార్టీ వృద్ధ నేతల ఆశలు అడియాశలే కాగా... లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా కూడా దక్కని స్థితిలో సీట్లు వచ్చాయి. దీంతో యువరాజు పేరు కాస్తా... పేలని పటాసుగా మారిపోయింది.
ఇక మొన్నటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అప్పటిదాకా అధికారం చెలాయించిన సమాజ్ వాదీతో పొత్తు పెట్టుకుని సోదరి ప్రియాంకా గాంధీని వెంటబెట్టుకుని తిరిగినా... రాహుల్ గాంధీ కారణంగా కాంగ్రెస్‌కు వచ్చిన సీటు ఒక్కటి కూడా లేదట. ఆ పార్టీకి దక్కిన 7 సీట్లు కూడా ఎస్పీతో పొత్తు పెట్టుకున్న పుణ్యాన వచ్చినవేనట. ఈ క్రమంలో రాహుల్ పై పేలుతున్న సెటైర్లత డోసు మరింతగా పెరిగిపోయిందని చెప్పక తప్పదు. ఇప్పటిదాకా రాహుల్‌పై పేలిన సెటైర్లన్నింటికీ... మధ్యప్రదేశ్‌కు చెందిన ఇంజినీరింగ్ స్టూడెంట్ విశాల్ ధావన్ తాజాగా పేల్చిన సెటైరే హైలెట్‌గా నిలిచిందని చెప్పక తప్పదు.
ఎందుకంటే... రాహుల్ గాంధీ ఓటమిలో రికార్డు సాధించారని, అందుకే రాహుల్ పేరును రికార్డుల పుటల్లోకి ఎక్కించాలని అతడు కోరుతున్నాడు. విశాల్ ఈ అభ్యర్థన చేసింది ఎవరికో తెలుసా... ప్రపంచ రికార్డులను చెక్కు చెదరకుండా కాపాడుతున్న గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థకు. విశాల్ అభ్యర్థన పంపినది గిన్నిస్ కు అయితే,... నిజంగానే రాహుల్ సెటైర్లన్నింటిలోకి ఇదే హైలెట్టే. ఎందుకంటే... ఈ తరహాలో రాహుల్ అపజయాల రికార్డులను ఏ ఒక్కరు కూడా బయటపెట్టలేకపోయారు.
ఇక విశాల్ చేసిన వాదన విషయానికి వస్తే... రాహుల్ గాంధీ 27 సార్లు ఎన్నికల్లో ఓడిపోయారని.. ఆయనను గిన్నిస్ బుక్ లో చేర్చాలంటూ దరఖాస్తు చేశాడు. గిన్నీస్ బుక్ కార్యాలయం రికార్డుల ప్రకారం... సదరు విద్యార్ధి అధికారులకు అప్లికేషన్ ఫీజు కూడా కట్టాడట. తన అభ్యర్థనను స్వీకరించినట్టు నిర్ధారణ పత్రం కూడా తీసుకున్నాడట. అయితే అమెరికాకి చెందిన గిన్నిస్ బుక్ ఈ తరహా అభ్యర్థనకు ఒప్పుకుంటుందా?.. లేదా? అన్నది తెలియాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/