Begin typing your search above and press return to search.
రాహుల్ గాంధీ నైట్ క్లబ్ వీడియో లీక్.. వైరల్
By: Tupaki Desk | 3 May 2022 11:00 AM GMTకాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అడ్డంగా బుక్కయ్యారు. ఓ నైట్ క్లబ్ లో ఆయన ఎంజాయ్ చేస్తున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. పెనుదుమారం రేపింది.నేపాల్ రాజధాని ఖట్మాండులోని ఓ నైట్ క్లబ్ కు రాహుల్ గాంధీ వెళ్లి ఆ పార్టీలో ఎంజాయ్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఓ వైపు ప్రశాంత్ కిషోర్ తో సంప్రదింపులు జరుపుతున్న వేళ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కనిపించకుండా పోయారు. రాహుల్ విదేశాలకు వెళ్లినట్లు కథనాలు వచ్చాయి. ఆయన ఎక్కడికి వెళ్లారనే దానిపై ఎప్పుడూ చెప్పారు. ఓ 15 రోజుల పాటు విదేశాల్లో ఎంజాయ్ చేసి తిరిగి వస్తుంటారు.ఈ నేపథ్యంలో తాజాగా రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. విదేశఆల్లో నైట్ క్లబ్ లో రాహుల్ ఎంజాయ్ చేస్తున్నట్టు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది.
బీజేపీ నేతలు ఈ వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ట్వీట్ లో రాహుల్ పై చురకలంటించారు. రాహుల్ చాలా స్థిరత్వం గల వ్యక్తి అని.. ఓ వైపు సొంత పార్టీలో రచ్చ నడుస్తుంటే ఆయన మాత్రం నైట్ క్లబ్ లో గడుపుతుంటారని ఎద్దేవా చేశారు.
ఇక రాహుల్ గాంధీ నేపాల్లోని ఖట్మాండులో ఓ పాపులర్ నైట్ క్లబ్ లో తన జర్నలిస్ట్ ఫ్రెండ్ వివాహానికి వెళ్లి అక్కడ పార్టీలో ఎంజాయ్ చేిసనట్లు స్థానిక మీడియా కథనాల ద్వారా తెలిసింది. రాహుల్ తన స్నేహితులతో కలిసి మారియట్ హోటల్ లో బస చేశాడని.. ఈ క్రమంలోనే నైట్ క్లబ్ పార్టీకి హాజరయ్యాడని తెలిసింది.
ఇక ఈ వీడియోలో రాహుల్ తో సన్నిహితంగా కనిపిస్తున్న మహిళ నేపాల్ లోని చైనా రాయబారి అని తెలుస్తోంది. దీంతో బీజేపీ నేతలు మనల్ని దొంగదెబ్బ తీస్తున్న చైనాతో రాహుల్ అంటకాగడంపై ఉతికి ఆరేస్తున్నారు.