Begin typing your search above and press return to search.
`లక్ష కోట్లు` నిరూపిస్తారా... రాజీనామా చేస్తారా?
By: Tupaki Desk | 7 Jan 2019 5:57 AM GMTరాఫేల్ డీల్ కేంద్రంగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ మధ్య మరోసారి మాటల తూటాలు పేలాయి. ప్రభుత్వ రంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ ఏ ఎల్-హాల్) పై సామాజిక మాధ్యమాల వేదికగా ఒకరి పై మరొకరు వాగ్బాణాలు సంధించుకున్నారు. హాల్ కు కేంద్రం రూ. లక్ష కోట్ల ఆర్డర్లు ఇచ్చిందని రక్షణమంత్రి పార్లమెంటులో చెప్పడం పచ్చి బూటకమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదివారం విమర్శించారు. మంత్రి తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటారా? అని ప్రశ్నించారు. లక్ష కోట్ల ఆర్డర్లకు సంబంధించిన పత్రాలను పార్లమెంటులో సోమవారం ప్రవేశపెట్టాలని, లేదంటే తన పదవికి రక్షణమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రక్షణమంత్రి సభలో చేసిన ప్రకటనకు సంబంధించిన పత్రాలు చూపాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. హాల్ కు కేంద్రం రూ.లక్ష కోట్ల ఆర్డర్లు కాదుగదా.. కనీసం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇప్పటివరకూ ఒక్కటంటే ఒక్క ఆర్డర్ కూడా సంస్థకు ఇవ్వలేదు. హాల్ ఉన్నతాధికారులే ఈ విషయం స్వయంగా వెల్లడించారు అని ధ్వజమెత్తారు. యూపీఏ హయాంలో హాల్ ను పూర్తిగా పక్కనపెట్టారని, సంస్థ పురోగతిని పట్టించుకోలేదంటూ రక్షణమంత్రి చేసిన విమర్శల పై రాహుల్ మండిపడ్డారు. ``మనం ఒక అబద్ధం చెబితే.. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని అబద్ధాలు ఆడాల్సి ఉంటుంది.
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ప్రధాని నరేంద్రమోదీ చెప్పిన అబద్ధాలను కప్పిపుచ్చే తొందరలో మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో అసత్యాలు వల్లెవేశారు`అని విమర్శలు గుప్పించారు. మోదీ తన సూట్-బూట్ స్నేహితుడి (అనిల్ అంబానీ)కి లబ్ధి చేకూర్చేందుకే రాఫెల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఇందుకోసం హాల్‌ను పణంగా పెట్టారని మండిపడ్డారు. దశాబ్దాల చరిత్రలో తొలిసారి ఉద్యోగుల జీతభత్యాల కోసం హాల్ రూ.1,000 కోట్ల రుణం తీసుకున్నట్లు వస్తున్న వార్తలపై ప్రధాని మోడీ, రక్షణమంత్రి సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో తన వ్యాఖ్యలు పోస్టు చేస్తూ ఓ పత్రిక కథనాన్ని ట్యాగ్ చేసి ఆయన ప్రశ్నించారు.