Begin typing your search above and press return to search.

ఏం రాహుల్‌..హోదా మీద ఇలా నిర‌స‌న చేయ‌లేదేం?

By:  Tupaki Desk   |   23 March 2018 10:35 AM GMT
ఏం రాహుల్‌..హోదా మీద ఇలా నిర‌స‌న చేయ‌లేదేం?
X
ఏపీ విభ‌జ‌న‌ను హ‌త్య‌తో పోల్చే నేత‌లు ఉన్నారు. ఎవ‌రి వ‌ర‌కో ఎందుకు సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. త‌ల్లిని చంపి.. అంటూ నాడు బీజేపీ ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ఉన్న మోడీనే వ్యాఖ్యానించ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. ఈ రోజు పార్ల‌మెంటు ఎదుట ఆయ‌న గాంధీ విగ్ర‌హం వ‌ద్ద కేంద్రం తీరుకు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ను నిర్వ‌హించారు.

కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో పార్టీ ఎమ్మెల్యేల్ని వెంట పెట్టుకొని నిర‌స‌న చేయ‌టం ఇదే తొలిసారి. ఇంత‌కీ ఆయ‌న నిర‌స‌న ఎందుకంటే.. ఎస్సీ.. ఎస్టీ యాక్ట్ పై సుప్రీం ఇచ్చిన తీర్పుపై కేంద్రం రివ్యూ పిటిష‌న్ వేయాల‌న్న డిమాండ్ తో ఆయ‌న నిరస‌న చేస్తున్నారు.

ఎస్సీ.. ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ను దుర్వినియోగం చేస్తున్నార‌ని.. బాధ్య‌త క‌లిగిన ఉద్యోగుల‌పై ఈ చ‌ట్టంతో వేధిస్తున్నార‌ని.. ఈ చ‌ట్టం కింద కేసు న‌మోదైన వెంట‌నే ప్ర‌భుత్వ ఉద్యోగుల్ని నేరుగా అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టు తీర్పులో వెల్ల‌డించింది. ఇదిలా సాగితే చ‌ట్టం నీరుకారిపోతుంద‌ని.. అందుకు సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిష‌న్ వేయాల‌ని రాహుల్ నిర‌స‌న చేప‌ట్టారు. ఈ ఇష్యూలో న్యాయాన్యాయాల గురించి ఇప్పుడు మాట్లాడ‌టం లేదు. ఒక అంశంపై రాహుల్ నిర‌స‌న చేస్తున్న‌ప్పుడు.. ఐదు కోట్ల ఆంధ్రులకు జ‌రుగుతున్న అన్యాయంపై ఆయ‌న ఎందుకు నోరు విప్ప‌టం లేదు?

ఇప్ప‌టి మాదిరి ఆయ‌న పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో ఎందుకు నిర‌స‌న చేప‌ట్ట‌రు? విభ‌జ‌న సంద‌ర్భంగా తాము చేసిన త‌ప్పుల‌కు నేడు ఏపీ అనుభ‌విస్తున్న విష‌యం అంద‌రూ చెబుతున్న వేళ‌.. చేసిన త‌ప్పును స‌రిదిద్దుకోవ‌టానికైనా రాహుల్ నిర‌స‌న బాట ప‌డితే బాగుంటుంది. హోదా మీద ఏపీలో పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. రాహుల్ నిర‌స‌న కాదు క‌దా.. హోదా మీద కీల‌క వ్యాఖ్య చేయ‌టం చూస్తే.. ఆయ‌న‌కు ఏపీ అవ‌స‌రం ఏమీ లేద‌న్నట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.