Begin typing your search above and press return to search.
రాహుల్..బీ కేర్ ఫుల్ విత్ బాబు..
By: Tupaki Desk | 22 Dec 2018 4:14 PM GMT"కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు మనతోనే ఉన్నారు"
" దేశ రాజకీయాల్లో ఏదైనా సాధించే అనుభవం..... రాజకీయ చతురత చంద్రబాబు నాయుడికే ఉన్నాయి"
ఇవన్నీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురించి ఆంధ‌్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు - అంతర్గత సమావేశాల్లో మాటలు. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలుగుదేశం - కాంగ్రెస్ పార్టీలు ప్రజాకూటమిగా కలిసి పోటీ చేసిన తర్వాత తెలంగాణ ప్రజలు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ పార్టీ దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. రానున్న ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు - లోక్ సభ ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని - ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీని గద్గె దింపేందుకు కాంగ్రెస్ తోనూ - ఇతర పార్టీలతోనూ కలవాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అయితే ఇందులో ఆయన స్వార్ధమే తప్ప మరొకటి లేదని కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలిసొచ్చేలా చేసారు చంద్రబాబు నాయుడు.
కాంగ్రెస్ తో సహా ఇతర పక్షాలన్నీ కలిసి పోరాడితే కేంద్రంలో అధికారంలోకి వస్తామని - తమ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారు. దీనికి చంద్రబాబు నాయుడు సహకరిస్తారని కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అయితే, రాజకీయంగా తన అవసరాల కోసం ఎవరినైనా వాడుకునే చంద్రబాబు నాయుడు అదే అవసరం కోసం ఎవరినైనా తొక్కేస్తారని తెలిసి ఇప్పుడు కంగుతింటున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఇండియా టుడే ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరుగుతున్న ఓ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు నాయుడు కొత్త కూటమిలో రాహుల్ గాంధీని ప్రధానిగా నిర్ణయించలేదని ప్రకటించారు. రాహుల్ గాంధీని కౌగలించుకోవడం - కరచాలనం చేయడం వంటివి చంద్రబాబు నాయుడి వ్యక్తిగత అవసరాలే అని ఈ సమావేశంలో ఆయన ప్రసంగంతో తేటతెల్లమైందంటున్నారు. తనకోసం కూతుర్ని ఇచ్చిన మామనే కూలదోసిన చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ పార్టీ ఓ లెక్కా అని రాజకీయ పండితులు అంటున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తంగా లేకపోతే చంద్రబాబు వారిని ముంచడం ఖాయమని అంటున్నారు.