Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఓట‌మి...అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ రాజీనామా?

By:  Tupaki Desk   |   23 May 2019 2:40 PM GMT
కాంగ్రెస్ ఓట‌మి...అధ్య‌క్ష ప‌ద‌వికి రాహుల్ రాజీనామా?
X
సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘోర‌ ప‌రాజ‌యం కాంగ్రెస్ పార్టీని ఓ కుదుపు కుదిపేస్తోంది.ఎన్నికల ఫలితాల తరవాత ఆయన ఢిల్లీలో మీడియాతో కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత తనదేనని అన్నారు. ఈ ఎన్నికల్లో గెలిచిన ప్రధాని మోడీకి ఆయన తొలుత అభినందనలు తెలిపారు. ఈ ఎన్నికల్లో కేవలం రెండు భావజాలాల మధ్య జరిగిన పోటీ అని ఆయన చెప్పారు. తమ పార్టీ భావజాలాన్ని విశ్వసించే వారు అధిక సంఖ్యలో ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులు - కార్యకర్తలకు ఆయన అభినందనలు తెలుపుతూనే.... ఓటమితో అధైర్యపడవొద్దని ధైర్యం చెప్పారు.

తాను అమేథీలో ఓటమిని అంగీకరించిన రాహుల్‌.... స్మృతి ఇరానీ ప్రేమతో అమేథి అభివృద్ధికి కృషి చేస్తారని తాను ఆశిస్తున్నట్లు రాహుల్‌ చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇరానీ ఎన్నో హామీలు ఇచ్చారని - వాటిని నెరవేర్చుతారన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలపై కాంగ్రెసార్టీ వర్కింగ్‌ కమిటీ భేటీ త్వరలోనే భేటీ అవుతుందన్నారు. ఇప్పటికిపుడు ఓటమికి కారణాలు చెప్పలేనని అన్నారు. ప్ర‌చారంలో ప్ర‌జ‌ల ముందుకు వెళ్లాన‌ని, ఆ ప్ర‌జ‌లే ఇవాళ త‌మ తీర్పును వెలువ‌రించార‌న్నారు. ప్ర‌ధాని మోదీకి - బీజేపీకి కంగ్రాట్స్ చెబుతున్న‌ట్లు రాహుల్ తెలిపారు. అయితే ఎక్క‌డ లోపం జ‌రిగింద‌న్న‌ అంశంపై ఇవాళ చ‌ర్చించ‌లేమ‌ని ఆయ‌న చెప్పారు. మోదీయే ప్ర‌ధాని అని ప్ర‌జ‌లు నిర్ణ‌యించార‌ని - ఒక భార‌తీయుడిగా ఆ నిర్ణ‌యాన్ని గౌర‌విస్తాన‌న్నారు. అమేథీ నుంచి స్మృతి ఇరానీ చేతిలో ఓట‌మిపాలైన‌ట్లు రాహుల్ అంగీక‌రించారు. ఓ విలేక‌రి అడిగిన ప్ర‌శ్న‌కు బ‌దులిస్తూ.. ఓట‌మిని ఒప్పుకుంటున్న‌ట్లు తెలిపారు. అమేథీలో ఓడిన రాహుల్‌.. కేర‌ళ‌లోని వ‌య‌నాడ్ నుంచి ల‌క్ష‌ల ఓట్ల‌ మెజారిటీతో నెగ్గారు.

ఇదిలాఉండ‌గా, కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామాకు రాహుల్ గాంధీ సిద్దపడినట్లు తెలుస్తోంది. యూపీ అధ్య‌క్షురాలు సోనియాగాంధికి రాజీనామా అందజేసేయోచనలో రాహుల్ గాంధీ ఉన్న‌ట్లు స‌మాచారం. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంద‌ని అంటున్నారు. అయితే, ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్ప‌ష్ట‌త రానుంది.