Begin typing your search above and press return to search.
రేవంత్‌కు పదవికి రాహుల్ ఓకే..ఇదే నిదర్శనం
By: Tupaki Desk | 30 Aug 2018 12:18 PM GMTతెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఫైర్ బ్రాండ్ నేత రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అందలం వేయనుంది. రెండు కళ్ల సిద్ధాంతం కారణంగా...తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలహీనపడటం, తన టార్గెట్ అయిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు కాంగ్రెస్ సరైన వేదికగా భావించిన కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ చేరిక సమయంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్ష పదవి లేక ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్ పదవుల్లో ఏదో ఒకటి ఇస్తామని అధిష్టానం హామీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది. అయితే నెలలు గడిచినా ఈ హామీ ఆచరణ రూపం దాల్చలేదు. అయితే తాజాగా దానికి మోక్షం కలిగింది. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పిలుపు మేరకు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇందుకు తార్కాణమని కాంగ్రెస్‌లోని విశ్వసనీయవర్గాల సమాచారం.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎదుర్కునేందుకు తెలుగుదేశం పార్టీ కంటే...తనకు సరైన వేదికగా భావించిన రేవంత్ రెడ్డి రాహుల్ సమక్షంలోనే పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ చేరిక సందర్భంగానే ఆయనకు ప్రచార కమిటీ చైర్మన్ పదవిని ప్రతిపాదించారు. కానీ ఆచరణ రూపం దాల్చలేదు. ఈ సమయంలోనే రేవంత్‌రెడ్డికి ఎలాంటి పదవి రాకుండా కొంత మంది సీనియర్లు అడ్డుకుంటున్నారని రేవంత్ సన్నిహిత వర్గాల ఆరోపణ. రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇమేజ్ ఉన్న తనను పార్టీ పట్టించుకోవడం లేదని అధిష్టానం వద్ద తన ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. పార్టీ పదవి లేకుండా ఇతర జిల్లాలకు, వేరే నియోజకవర్గాలకు పోవాలన్నా రేవంత్‌కు కొంత ఇబ్బందిగా మారింది. తన నియోజకవర్గం దాటి బయటకు పోవడానికి వీలులేకుండాపోయింది. నియోజకవర్గాలకు ఎవరైనా ఆహ్వానించినా పార్టీ అధ్యక్షుడిని సంప్రదించాల్సి వస్తున్నది. దీంతో ఎక్కడికి వెళ్లకుండా తన నియోజకవర్గానికి పరిమితం అవుతున్నట్టు తన గోడు వెళ్లబోసుకున్నట్టు తెలిసింది.
దీనికి తోడుగా, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ రెండు రోజుల సుడిగాలి పర్యటనలో రేవంత్‌రెడ్డి హవా కనిపించింది. శంషాబాద్, శేరిలింగంపల్లి సభలలో ఆయన మాట్లాడుతారని కార్యకర్తలు భావించినా... ఆయనకు మాట్లాడే అవకాశం రాలేదు. అయితే ఆయన మాట్లాడాలని సభికుల నుంచి డిమాండ్ రావడంతో సరూర్‌నగర్‌సభలో మాట్లాడినట్టు తెలిసింది. ఈ సభలో ఆయన మాట్లాడుతున్న సేపు కార్యకర్తల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. ఆయన ప్రసంగాన్ని రాహుల్‌గాంధీ సైతం ఆసక్తిగా తిలకించడం విశేషం. దీంతోపాటుగా ఈ టూర్‌లో రాహుల్ రేవంత్‌తో ప్రత్యేకంగా సమావేశం అయి, పార్టీ గురించి ఆరాతీసినట్లు సమాచారం. ఈనెలలోనే ఢిల్లీలో రేవంత్‌తో సహా పార్టీ ముఖ్యులతో రాహుల్‌గాంధీతో సమావేశం కానున్నారని వార్తలు వచ్చాయి. ఈ సందర్భంగానే పార్టీలో కొత్త నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారని `తుపాకి` ముందే వెల్లడించింది.
దీన్ని నిజం చేస్తూ తాజాగా పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆఘమేఘాల మీద కాంగ్రెస్ రథసారథి రాహుల్ గాంధీ ఢిల్లీకి పిలిచారు. ముందస్తు ఎన్నికల హడావుడి నేపథ్యంలో, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి సిద్ధం కావాల్సిన సమయంలో కొత్త కమిటీలు తప్పనిసరిగా భావిస్తూ నూతన కమిటీ వేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కసరత్తులో రేవంత్ రెడ్డి పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ పదవి ఖరారు కానుందని తెలుస్తోంది.