Begin typing your search above and press return to search.
హస్తం పార్టీ చీఫ్ ఎవరు?..షిండేనా? - ఖర్గేనా?
By: Tupaki Desk | 4 July 2019 1:30 AM GMTగ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పెద్ద ఇబ్బందే వచ్చి పడింది. తాజా ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన ఆ పార్టీకి ఇక తాను అధ్యక్షుడిగా ఉండలేనంటూ రాహుల్ గాంధీ తేల్చి చెప్పడంతో పాటుగా ఏకంగా తన రాజీనామాను కూడా సమర్పించేశారు. చాన్నాళ్ల నుంచి ఆయనను బుజ్జగిస్తూ వస్తున్న పార్టీ సీనియర్లు... రాహుల్ తన రాజీనామాను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇక చేసేది లేక ఆయన రాజీనామాకు ఆమోదం తెలపక తప్పలేదు. మరి రాహుల్ తప్పుకుంటే... ఆ పార్టీ పగ్గాలు చేపట్టేదెవరు?
ప్రస్తుతానికి అయితే గాంధీ ఫ్యామిలీకి వీర విధేయుడిగా ఉన్న మోతీలాల్ వోరాను తాత్కాలిక అధ్యక్షుడిగా ఖరారు చేసిన కాంగ్రెస్ పార్టీ... కొత్త అధ్యక్షుడి కోసం కసరత్తు ప్రారంభించేసింది. ఈ క్రమంలో పలువురు సీనియర్ నేతల పేర్లు రేసులోకి వచ్చేస్తున్నారు. ఈ జాబితా చాంతాడంత పెరగడం ఖాయంగానే కనిపిస్తున్నా... తొలుత ఈ రేసులోకి వచ్చింది మాత్రం ఇద్దరే. వారే కేంద్ర హోం శాఖ మాజీ మంత్రిగానే కాకుండా మహారాష్ట్ర సీఎంగా - ఉమ్మడి ఏపీకి గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వర్తించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సుశీల్ కుమార్ షిండే ఒకరు కాగా... 2014 ఎన్నికల్లో పార్టీ బోల్తా పడితే విపక్ష నేతగా తాను కాదంటే తానూ కాదంటూ సోనియా గాంధీ - రాహుల్ గాంధీ విముఖత వ్యక్తం చేస్తే... లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేతగా బాధ్యతలు నిర్వర్తించిన మల్లిఖార్జున ఖర్గే మరొకరు.

ఖర్గే కూడా కేంద్ర మంత్రిగా కూడా వ్యవహరించిన వారే. ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీతో సుధీర్ఘ అనుబంధం ఉంది. ఇద్దరూ రాజకీయాల్లో తల పండిన నేతలే. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై పూర్తిగా పట్టున్న నేతలే.
అంతేకాదండోయ్... ఇద్దరు కూడా గాంధీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులే. ఇలా ఇద్దరికీ దాదాపుగా అన్ని అంశాల్లో పోలిక ఉన్నా... గాంధీ ఫ్యామిలీతో పాటు కాంగ్రెస్ లోని మెజారిటీ నేతలు వీరిలో ఎవరిని కాంగ్రెస్ పార్టీ చీఫ్ గా ఎన్నుకుంటారన్న ఆసక్తి రేకెత్తుతోంది.