Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ లో అల‌క‌పాన్పుల‌కు రాహుల్ చెక్!

By:  Tupaki Desk   |   31 Aug 2018 4:28 PM GMT
టీ కాంగ్రెస్ లో అల‌క‌పాన్పుల‌కు రాహుల్ చెక్!
X
2014 నుంచి ఇరు తెలుగు రాష్ట్రాల‌లో కాంగ్రెస్ ప‌రిస్థితి రెంటికీ చెడ్డ రేవ‌డి అన్న చందంగా త‌యారైన సంగ‌తి తెలిసిందే. ప్ర‌త్యేక తెలంగాణ ఇస్తే ఏపీలో డిపాజిట్లు ద‌క్క‌వ‌ని తెలిసినా....తెలంగాణ‌లో అధికారం ద‌క్కించుకుందామ‌ని ఎత్తుగడ వేసింది కాంగ్రెస్. కానీ, రెండు రాష్ట్రాల్లో పార్టీ కోలుకోని విధంగా దెబ్బ‌తింటుంద‌ని ఊహించ‌లేక‌పోయింది. గ‌తాన్ని వదిలేసి ఎలాగైనా 2019లో తెలంగాణ‌లో పుంజుకోవాల‌ని కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాలు ర‌చిస్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం టీ కాంగ్రెస్ లో రాబోయే ఎన్నిక‌ల స‌మ‌రోత్సాహం నింపేందుకు స‌మాయ‌త్త‌మ‌వుతోంది. ఏ ప‌ద‌వీ లేకుండా పార్టీకి సేవ‌చేయ‌డం క‌ష్ట‌మ‌ని భావించిన అధిష్టానం....త‌మ నేత‌ల‌కు ప‌ద‌వుల తాయిలాలు ఇచ్చేందుకు రెడీ అయింది. ఫ‌లానా వారికి ఫ‌లానా ప‌ద‌వి అంటూ.....కొంత‌మంది నేత‌ల అల‌క పాన్పులు తీర్చేందుకు కృషి చేస్తోంది.

2019లో ఎన్నిక‌లు వ‌చ్చినా....అక్టోబ‌రులో ముందస్తు ఎన్నికుల వ‌చ్చినా....సిద్ధంగా ఉండేందుకు తెలంగాణ కాంగ్రెస్ ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు రెడీ అయింది. కొంత‌మంది నేత‌ల‌ను బుజ్జ‌గించేందుకు వారికి ప‌దవులు...అద‌న‌పు బాధ్య‌త‌లు ఇచ్చేందుకు రెడీ అయింది. ప్ర‌స్తుతం కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మ‌ల్లు భ‌ట్టి తో పాటు మ‌రో ఇద్ద‌రు...బీసీలను క‌న్వీన‌ర్ లు గా నియ‌మించాల‌ని చూస్తోంది. అయితే, ఆ సంఖ్య పెంచితే త‌న‌కు విలువుండ‌దని భ‌ట్టి వాపోతున్నార‌ని టాక్. మ‌రోవైపు - ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా....రేవంత్ ఎన్నిక కాకుండా...ఉత్త‌మ్ అడ్డుకుంటున్నార‌ని టాక్. ఉత్త‌మ్ ను డైరెక్ట్ గా రేవంత్ ఈ విష‌యం గురించి అడిగార‌ట‌. అయితే, ఇప్ప‌టికే జానా రెడ్డి - ఉత్త‌మ్ కుమార్ రెడ్డి లు రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి ఉన్నార‌ని, ఇపుడు రేవంత్ రెడ్డికి ఆ బాధ్య‌త ఇస్తే బీసీలు అల‌క‌పాన్పు ఎక్కుతార‌ని హైక‌మాండ్ అభిప్రాయ‌ప‌డుతోంద‌ట‌. మ‌రోవైపు, మేనిఫెస్టో క‌మిటీగా దామోద‌ర్ రాజ న‌ర్సింహాను నియ‌మించి....ఆయ‌న అల‌క తీర్చాల‌ని ప్లాన్ వేస్తోంద‌ట‌. అయితే, సాధ్య‌మైనంత ఎక్కువ మందికి బాధ్య‌త‌లు ఇచ్చి అల‌క‌లు తీర్చాల‌ని ఉత్తమ్ ...రాహుల్ కు చెప్పార‌ట‌. మ‌రి, ఈ అల‌క పాన్పుల‌ను రాహుల్ ఎలా డీల్ చేస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.