Begin typing your search above and press return to search.
ఆమెను పిలుస్తున్నారంటే రాహుల్ కు చేతకాదా?
By: Tupaki Desk | 20 Sep 2016 7:53 AM GMTకాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. పార్టీకి సంబంధించి పలువురు నేతలు.. వీర విధేయులు సోనియాగాంధీ కుమార్తె ప్రియాంక గాంధీని రాజకీయాల్లోకి వచ్చేయాలని డిమాండ్ చేస్తుంటారు. ఈ అంశంపై పార్టీ సీనియర్లు కాస్తో కూస్తో స్పందించినా.. పార్టీ మాత్రం రియాక్ట్ అయ్యింది లేదు. తాజాగా మాత్రం అందుకు భిన్నంగా యూపీ ప్రచారంలో తలమునకలైన రాహుల్.. తన సోదరి ప్రియాంకను రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరటం ఆసక్తికరంగా మారింది.
ఇప్పటివరకూ పార్టీ నేతలకు మాత్రమే పరిమితమైన ఈ పిలుపు.. స్వయంగా పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ నోటి నుంచే రావటంపై పార్టీ వర్గాలు సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. ఎందుకంటే.. ప్రియాంక రాజకీయాల్లోకి రావాలా? వద్దా? అన్నది కేవలం ఆమె వ్యక్తిగత అభిప్రాయం. సోదరి గురించి అంతా తెలిసిన రాహుల్.. ఆమెను రాజకీయాల్లోకి ప్రత్యేకంగా ఆహ్వానించాల్సిన అవసరమే లేదు. ఇంట్లో కానీ వారు ఒక మాట అనుకుంటే ఆమె వచ్చేస్తారు. కానీ.. అందుకు భిన్నంగా నాటకీయ పరిణామాల్లో తన సోదరి రాజకీయాల్లోకి రావాలని తాను కోరుకుంటున్నట్లుగా రాహుల్ పేర్కొన్నారు. తన సోదరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే తాను చూడాలని భావిస్తున్నట్లుగా రాహుల్ చెప్పారు.
‘‘ఆమె రాజకీయాల్లోకి వస్తే సంతోషంగా ఉంటుంది. అయితే.. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది ఆమే. అందరికంటే నేను నా సోదరి ప్రియాంకను ఎక్కువగా నమ్ముతా. ఇష్టపడతా’’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ కు తరచూ సలహాలు.. సూచనలు ఇస్తారని పేరున్న ప్రియాంకను రాహుల్ రాజకీయాల్లోకి రావాలని స్వయంగా ఆహ్వానించటం చూస్తుంటే.. ప్రియాంక పొలిటికల్ ఎంట్రీకి సిద్ధం చేస్తున్నారా? అన్న సందేహం ఇప్పుడు అందరి మదిని తొలిచేస్తోంది.