Begin typing your search above and press return to search.

అరే.. రాహుల్ భయ్యాకు హిందీ రాదే

By:  Tupaki Desk   |   14 Aug 2015 5:01 AM GMT
అరే.. రాహుల్ భయ్యాకు హిందీ రాదే
X
కొన్నిసార్లు ఆసక్తికరమైన విషయాలు అనుకోకుండా బయటకు వచ్చేస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒకటి బయటకు వచ్చింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. రానున్న రోజుల్లో ఆ పార్టీకి అధినేతగా మారనున్న రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం బయటకు రావటమే కాదు.. ఇప్పుడ సోషల్ మీడియాలో హడావుడి చేస్తోంది.

రాహుల్ ను వ్యతిరేకించే వారికి కొత్త పని కల్పిస్తూ.. అదే సమయంలో ఆయన్ను అభిమానించే వారి వాదనా పటిమను మరింతే పెంచే ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..

దీర్ఘకాలిక సెలవు మీద వెళ్లి వచ్చిన నాటి నుంచి ఆవేశంతో ఊగిపోతూ.. తన బాడీ లాంగ్వేజ్ కు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ.. ఎప్పటిమాదిరే సుష్మా స్వరాజ్ మీద నిప్పులు చెరిగి పార్లమెంటు నుంచి బయటకు వస్తున్న సమయంలో.. ఆయన చేతిలో ఉన్న ఒక పేపర్ ఒక మీడియా కెమేరాలో నమోదైంది. పేపర్ పట్టుకోవటం తప్పే కదా అంటే తప్పులో కాలేసినట్లే. అక్కడే అసలు విషయం ఉంది.

ఆయన చేతిలో ఉన్న పేపరులో అక్షరలన్నీ ఇంగ్లిషులో ఉన్నాయి. కానీ.. ఆ భాష మాత్రం హిందీకి సంబంధించి. అంటే.. హిందీని ఇంగ్లిలిపీసులో రాసుకున్న పేపరు ఆధారంగా రాహుల్ ఆవేశంతో ఊగిపోతూ చదవటం తెలిసిందే. అంటే.. హీందీలో ఇరగొట్టినట్లు మాట్లాడే రాహుల్ భయ్యాకు.. హిందీ రాయటం రాదన్న మాట అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇదేం పెద్ద తప్పు కాదని వెనకేసుకొచ్చే వారు కొందరున్నా.. హిందీని ఇంగ్లిషులో రాసుకొచ్చి.. పేపర్ తో సహా దొరికిపోయిన రాహుల్ పై విమర్శకులు మాత్రం విరుచుకుపడుతున్నారు. రాహుల్ కు హిందీ రాదా? హిందీ మాటల్నిఇంగ్లిషులో చదువుకొని మాట్లాడతారా? అంటూ కొత్త చర్చ మొదలు పెడతారు. మరికొందరైతే.. జాతీయ భాష హిందీ రాదు సరే.. ఇటాలియన్ వచ్చి ఉంటుందిలే అని కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.