Begin typing your search above and press return to search.

కాబోయే ప్ర‌ధానిని నేనేనేమో...: రాహుల్‌

By:  Tupaki Desk   |   8 May 2018 8:33 AM GMT
కాబోయే ప్ర‌ధానిని నేనేనేమో...: రాహుల్‌
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. తొలిసారిగా ప్రధాని పదవిపై పెదవి విప్పారు. 2019లో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరిస్తే ప్రధాని అవుతానేమోనని ఆయన వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ మీడియాతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. ఓ అవినీతి వ్యక్తిని ఎందుకు కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారో ప్రధాని మోడీ చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. రూ. 35 వేల కోట్లు దోచుకున్న గాలి జనార్ధన్‌ రెడ్డి అనుచరులకు ఎందుకు 8 సీట్లు ఇచ్చారని ప్రశ్నించారు. మోడీ సర్కార్‌ పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. పలు హత్య కేసుల్లో నిందితుడైన అమిత్‌షాను ప్రజలు ఎవరూ నమ్మడం లేదన్నారు. ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం లేదో యువతకు మోడీ సమాధానం చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నయడ్యూరప్పని సీఎం అభ్యర్థిగా ఎందుకు ప్రకటించారో చెప్పాలని మోడీని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. రూ.35వేల కోట్లు దోచుకున్న గాలి జనార్ధన్ రెడ్డి వర్గానికి 8 సీట్లు ఎందుకు ఇచ్చారని నిలదీశారు. యువతకు ఉద్యోగ కల్పన ఎందుకు జరగడం సమాధానం చెప్పాలని అన్నారు. 2కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన ప్రధాని ఇప్పుడెందుకు మాట్లాడటం లేదన్నారు. మొబైల్ ఫోన్లలో మూడు మోడ్స్ ఉంటాయి. వర్క్‌మోడ్.. స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్. మోడీజీ స్పీకర్ మోడ్, ఎయిరోప్లేన్ మోడ్‌నే వాడతారు. వర్క్‌మోడ్ జోలికి అస్సలు వెళ్లరని రాహుల్ అన్నారు.