Begin typing your search above and press return to search.
బీజేపీ.. సంఘ్ నిజమైన హిందువులు కారు.. ఈ మాటలు సూట్ కావు రాహుల్
By: Tupaki Desk | 16 Sep 2021 5:15 AM GMTరాజకీయం కోసం మతాన్ని వాడేసుకోవటం ఎలా అన్న విషయాన్ని నేర్పించి కాంగ్రెస్ పార్టీ. తప్పు చేసిన తర్వాత.. ఆ తప్పు కారణంగా ప్రయోజనం పొందినా.. దానికి సంబంధించిన నొప్పి ఆ తర్వాత ఎప్పుడో ఒకప్పుడు పడక తప్పదు. ప్రస్తుతం కాంగ్రెస్ అలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటోంది. మైనార్టీల పేరుతోకాంగ్రెస్ ఆడిన ఓటుబ్యాంకు రాజకీయాలకు చెక్ పెట్టటమే కాదు.. దానికి రివర్సుగేరులో హిందూ ఓటు బ్యాంకును వాడేసి అధికారంలోకి వచ్చిన ఘనత బీజేపీదే. ఈ రెండు పార్టీల్ని చూస్తే.. ఎవరి ఆట వారు ఆడారు. వారి ఆటకు ఆయా మతస్తులు తమకు తెలీకుండానే వారికి చిక్కిన పరిస్థితి. నిజానికి .. రెండు పార్టీలకు ఆయా మతస్తుల అండ కేవలం అధికారం కోసమే తప్పించి మరింకేమీ కాదు. కాంగ్రెస్ ను కాసేపు పక్కన పెడదాం.. బీజేపీ సంగతి చూద్దాం.
కేరళలో అధికారంలో ఉన్న వామపక్ష ప్రభుత్వం ఇష్టారాజ్యంగా శబరిమలై ఆలయ ఉదంతంలో.. కేంద్రంలోని మోడీ సర్కారు చేసిందేమిటి? కోట్లాది మంది హిందువులకు రక్షక పార్టీగా చెప్పుకునే బీజేపీ.. శబరిమలై విషయంలో మోడీ సర్కారు బలంగా ఎందుకు ప్రశ్నించలేదు? తన ‘హిందూ’ వాదనను ఎందుకు వినిపించలేదు? ఇదంతా చూసినప్పుడు బీజేపీకి హిందువుల మీద ప్రత్యేకమైన అభిమానం లేదన్న విమర్శ వినిపిస్తుంటుంది. కాకుంటే.. కాంగ్రెస్ తో పోలిస్తే.. బీజేపీ కాస్త బెటర్ అన్న భావన కోట్లాది మందిలో ఉంది.
ఇదిలా ఉంటే.. తాజాగా హిందూమతాన్ని జాతిపిత గాంధీ అర్థం చేసుకున్నారని.. ఆయన మాత్రమే హిందూ మతాన్ని అర్థం చేసుకొని పాటించారన్న వ్యాఖ్య చేశారు కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ. తాజాగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ.. సంఘ్ పరివార్ నేతలు నిజమైన హిందువులు కారన్నారు. స్వలాభం కోసమే వారు హిందూ మతాన్ని వాడుకుంటున్నారన్నారు. అఖిల భారత మహిళా కాంగ్రెస్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ.. కాంగ్రెస్ సిద్ధాంతాలు భిన్నమైనవన్న ఆయన.. ఏదో ఒక సిద్ధాంతం మాత్రమే దేశాన్ని పాలిస్తుందన్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ.. బీజేపీ.. సంఘ్ పరివార్ బూటకపు హిందువులని.. తమ స్వప్రయోజనాల కోసం మతాన్ని వాడుకుంటున్నారన్నారు. సంఘ్ ను పక్కన పెడితే బీజేపీ విషయంలో రాహుల్ చేసిన వాదనను పలువురు సమర్థిస్తారు. ఎదుటివారిని తప్పు పట్టే రాహుల్.. తమ పార్టీ ఏం చేసిందన్న విషయానికి ఆయనేం చెబుతారు?
లక్ష్మీదేవి అధికారానికి గుర్తు అని.. లక్ష్య సాధనకు సాయం చేస్తుందన్న ఆయన కాపాడే లక్షణాలు దుర్గా మాతలో ఉన్నాయని.. అధికారానికి చిహ్నం దుర్గగా అభివర్ణించాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ శక్తుల్ని బలోపేతం చేసిందన్న ఆయన మాటలు వినేందుకు బాగానే ఉన్నా.. ఓటు బ్యాంకు రాజకీయాలకు తెర తీసింది తామేనన్న నిజాన్ని ఒప్పుకుంటే ఆయన మరింతమంది మనసుల్ని గెలుచుకునే వారనటంలో సందేహం లేదు.