Begin typing your search above and press return to search.
మందకృష్ణకు టైమిచ్చేందుకు రాహుల్ నో!
By: Tupaki Desk | 14 Aug 2018 5:57 AM GMTతెలంగాణలోని పార్టీ వర్గాలకు కొత్త శక్తిని ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేపట్టిన పర్యటన రెండో రోజుకు చేరుకుంది. తన తొలిరోజు పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఆయన.. రెండో రోజున కీలకభేటీలు నిర్వహించనున్నారు. శేరిలింగంపల్లిలో ఏర్పాటు చేసిన సభలో మోడీ సర్కారుతో పాటు.. కేసీఆర్ పైనా మండిపడిన రాహుల్.. ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
తన పర్యటనలో భాగమైన రెండో రోజున పలు వర్గాలకు చెందిన ప్రముఖులతో భేటీ కానున్నారు. రాహుల్ ను కలిసేందుకు ఈ రోజు (మంగళవారం) ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హరిత ప్లాజాకు వచ్చారు. అయితే.. ఆయన్ను కలిసేందుకు రాహుల్ టైమివ్వకపోవటం గమనార్హం.
తన రెండో రోజు టూర్ లో భాగంగా రాహుల్ ఈ రోజంతా బిజీబిజీగా ఉండనున్నారు. పార్టీ బూత్ కమిటీ అధ్యక్షులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించనున్న ఆయన.. ఉదయం 10.30 గంటలకు ఎడిటర్లతో సమావేశం కానున్నారు. అనంతరం 11.45 గంటలకు ఓయూ నేతలతో భేటీ కానున్నారు.
మధ్యాహ్నం తాజ్ కృష్ణలో పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్న రాహుల్.. అనంతరం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చిరు వ్యాపారులు.. కార్యకర్తలతో రాహుల్ మీటింగ్ కానున్నారు. అనంతరం సరూర్ నగర్ లో నిర్వహించే నిరుద్యోగ గర్జనలో రాహుల్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పటికీ.. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణకు మాత్రం అపాయింట్ మెంట్ ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా విపక్షంలో ఉన్న వారు.. వీలైనంత ఎక్కువమందిని కూడగట్టుకోవటం చేస్తుంటారు. అందుకు భిన్నంగా మందకృష్ణ విషయంలో రాహుల్ భేటీ కాకుండా ఉండటం ఆసక్తికరంగా మారింది.