Begin typing your search above and press return to search.

ట్విటర్ ఆ ట్యాగ్ తీసేసుకున్న రాహుల్!

By:  Tupaki Desk   |   4 July 2019 2:30 PM GMT
ట్విటర్ ఆ ట్యాగ్ తీసేసుకున్న రాహుల్!
X
'ఏఐసీసీ ప్రెసిడెంట్' అనే ట్యాగ్ ను తీసేసుకున్నాడు రాహుల్ గాంధీ. కొన్ని నెలల కిందట కాంగ్రెస్ వాళ్ల హంగామా మధ్యన కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ హోదాను తీసుకున్నారు రాహుల్ గాంధీ. ఏఐసీసీకి ప్రెసిడెంట్ అయిపోయారు. ఆ విషయంలో రాహుల్ కు ఎదురులేకపోయింది.

అయితే రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా చిత్తు అయ్యింది. కనీసం ప్రధాన ప్రతిపక్ష హోదాను సంపాదించుకోలేకపోయింది. ఆ ఓటమికి బాధ్యత వహిస్తూ రాహుల్ రాజీనామా అనడం.. దానికి కాంగ్రెస్ వాళ్లు ఒప్పుకోకపోవడం తెలిసిన సంగతే.

అందుకు సంబంధించి ఒక సీరియల్ నడిచింది. రాహుల్ తన రాజీనామాకు పట్టుపట్టడం.. తన రాజీనామాను వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని అనడం.. అయితే కాంగ్రెస్ వాళ్లు ఆయన రాజీనామాను వెనక్కు తీసుకోవాలని ఒత్తిడి చేయడం..ఇదంతా కొన్ని రోజుల పాటు కొనసాగింది. చివరకు రాహుల్ పంతం నెగ్గించుకున్నాడు. రాజీనామాను ఆమోదింపజేసుకున్నాడు.

ఇలాంటి క్రమంలో రాహుల్ ట్విటర్లో కూడా 'ఏఐసీసీ ప్రెసిడెంట్' హోదాను తీసేసుకున్నాడు. ఇలా అప్ టు డేట్ గా ఉన్నారు రాహుల్. 'మెంబర్ ఆఫ్ పార్లమెంట్, మెంబర్ ఆఫ్ కాంగ్రెస్' అనే హోదాలను మాత్రమే రాహుల్ ట్విటర్లో పేర్కొన్నారు.

ఇక మరింత గట్టిగా పోరాడబోతున్నట్టుగా రాహుల్ ప్రకటించుకున్నారు. తను అధ్యక్ష పదవి నుంచి వైదొలిగినా.. కాంగ్రెస్ తరఫున బీజేపీపై తన పోరాటం కొనసాగుతుందన్నట్టుగా రాహుల్ గాంధీ ప్రకటించుకున్నారు.