Begin typing your search above and press return to search.
మోడీని రాహుల్ ప్రేమతోనే గెలుస్తాడట!
By: Tupaki Desk | 14 Feb 2019 11:44 AM GMTమోడీ.. రాహుల్ ఇద్దరూ వయసులోనే కాదు.. భావజాలాల విషయంలోనూ ఏ మాత్రం పొసగని తీరు కనిపిస్తూ ఉంటుంది. విచిత్రంగా ఇద్దరి ఆయుధాలు భావోద్వేగమే అయినా.. ఇరువురు వాటిని ప్రయోగించే తీరు మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. సమకాలీన రాజకీయాల్లో ఎవరూ రియాక్ట్ కాని తీరులో వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించిన రాహుల్.. మోడీని హగ్ చేసుకున్న ఎపిసోడ్ లో కాస్త లీడ్ లోకి వచ్చినా.. ఆ తర్వాత అతగాడు కొట్టిన కొంటె కన్నుగీత ఆయనపై విమర్శలు చేసేలా చేసింది.
గత కాంగ్రెస్ అధినేతలకు భిన్నంగా వ్యవహరిస్తారన్నట్లు పేరున్న రాహుల్.. తన మాటలతో.. చేతలతో ఆ పని చేసినా ఇప్పటికి పలువురు కాంగ్రెస్ ద్వేషులు రాహుల్ ను నమ్మని పరిస్థితి. ప్రత్యర్థుల విషయంలో రాహుల్ చూసిచూడనట్లుగా వ్యవహరిస్తే.. మోడీ రియాక్షన్ మాత్రం కాస్త తీవ్రంగానే ఉంటుందని చెప్పాలి. మోడీకి మాటలతో పంచ్ ఇవ్వలేని రాహుల్.. చేతలతో ఆయన్ను ఆత్మరక్షణలో పడేసే ప్రయత్నం చేశారు.
ప్రేమతో తాను ప్రధానిని హత్తుకుంటే.. దాన్ని ఎటకారం చేశారన్న ప్రచారంతో కాస్త లాభం పొందిన రాహుల్ కు పంచ్ వేసేలా నిన్నటి లోక్ సభ సమావేశంలో మోడీ వ్యాఖ్యానించారు. రాహుల్ హగ్ ను ఎటకారం చేయటంతో పాటు.. అదంతా సినిమాటిక్ వ్యవహారంగా తేల్చేశారు. ఇదిలా ఉంటే.. మోడీ చేసిన వ్యాఖ్యలకు తాజాగా రాహుల్ బదులిచ్చారు. తనపై మోడీలోని ద్వేషాన్ని తనలోని ప్రేమతో ఎదుర్కొంటానని వ్యాఖ్యానించారు.
ఆజ్మీర్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన రాహుల్.. తన కుటుంబాన్ని..కాంగ్రెస్ పార్టీని మోడీ అవమానిస్తున్నారని ఆరోపించారు. తనకు సన్నిహితంగా ఉన్న పారిశ్రామికవేత్తలకు మోడీ బ్యాంకు రుణాల్ని రద్దు చేశారన్నారు. తానుపార్లమెంటులోమోడీని ఆలింగనం చేసుకున్నానని.. ద్వేషాన్ని ప్రేమతోనే ఓడిస్తానని చెప్పారు. ఆయనలో ద్వేషం ఉందని.. తనలోని ప్రేమతో తాను బదులిచ్చినట్లుగా చెప్పారు. ఈ ద్వేషం.. ప్రేమల సంగతి పక్కన పెడితే.. ఇరువురి మాటలకు దేశ ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.