Begin typing your search above and press return to search.
బ్రిటీషర్లకు సావర్కర్ లేఖ.. బీజేపీని ఇరుకునపెట్టిన రాహుల్ గాంధీ
By: Tupaki Desk | 17 Nov 2022 11:49 AM GMTస్వాతంత్ర్య పోరాట సమయంలో బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పిటిషన్లపై హిందుత్వ సిద్ధాంతకర్త, బీజేపీ జన్ సంఘ్ నేత వీడీ సావర్కర్ రాసిన లేఖలను బయటపెట్టి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాత్రలేదన్న వారికి షాకిచ్చేలా బ్రిటీష్ వారికి నాటి బీజేపీ నేత సావర్కర్ అమ్ముడుపోయారని ఆరోపించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో జన్ సంఘ్ నేతలు బ్రిటీషర్లపై పోరాడాల్సింది పోయి సహకరించారని రాహుల్ ఆధారాలు బయటపెట్టారు. ఈ మేరకు నిరూపించే ఓ లేఖను ఇవాళ కాంగ్రెస్ ఎంపీ రాహుల్ బయటపెట్టారు.
రాహుల్ గాంధీ మహారాష్ట్రలోని అకోలాలో విలేకరుల సమావేశంలో తన వ్యాఖ్యలకు మద్దతుగా వీడీ సావర్కర్ రాసిన లేఖ కాపీని చూపిస్తూ: "సావర్కర్ జీ అందులో ఇలా వ్రాశాడు: 'సర్, మీ అత్యంత విధేయుడైన సేవకుడిగా ఉండమని నేను వేడుకుంటున్నాను.' అతను ఈ లేఖపై సంతకం చేశాడని అతను బ్రిటిష్ వారికి భయపడ్డాడని' రాహుల్ ఆరోపించారు. . దీనిపై రాహుల్ గా గాంధీ మాట్లాడుతూ, "ఎవరైనా ఇది తప్పు అని అన్నట్లయితే భావజాలాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటే, వారు ముందుకు రావాలి." అని సవాల్ చేశారు.
సావర్కర్ రాసిన లేఖలో భారత్ కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఉన్నాయని.. ముఖ్యంగా అప్పట్లో బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా పోరాడుతున్న భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ మరియు వల్లభాయ్ పటేల్ ను మోసం చేసేలా ఉన్నాయని రాహుల్ ఆరోపించారు. సంవత్సరాలు జైలు జీవితం గడిపారని "అయినా వారు అలాంటి లేఖపై సంతకం చేయలేదు" అని పేర్కొన్నారు. "సావర్కర్ జీ ఈ లేఖపై సంతకం చేయడం భారత్ ను మోసం చేయడమే అని అన్నారు. ఇది బీజేపీ సిద్ధాంతం అని.. మాకు నియంతలు లేరు." అంటూ తెలిపారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ "బ్రిటీష్ వారు అతనికి భూమిని అందించారు. బిజెపి మరియు ఆర్‌ఎస్‌ఎస్‌లకు, బ్రిటిష్ వారికి క్షమాభిక్ష పిటిషన్లు వ్రాసి, పెన్షన్‌ను స్వీకరించిన సావర్కర్‌జీకి విగ్రహం. ఏర్పాటు చేశారా?' అని విమర్శించారు.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అండగా నిలిచింది. "ఇది వాస్తవం: సావర్కర్ బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పి, దేశాన్ని బ్రిటిష్ వారికి అమ్మేశాడు. ఈ విషయం కూడా చెబుతాను' అని సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఈరోజు గుజరాత్‌లో అన్నారు.
వీడీ సావర్కర్ గురించి రాహుల్ గాంధీ, కాంగ్రెస్ వక్రీకరించిన చరిత్రను వ్యాప్తి చేస్తున్నాయని, అయితే మహారాష్ట్ర ప్రజలు వారికి గుణపాఠం చెబుతారని బీజేపీ ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు.
ఇప్పుడు సావర్కర్ ను బూచీగా చూపి బీజేపీ దేశభక్తిపై కాంగ్రెస్ సంధిస్తున్న ఈ ప్రశ్నలు వైరల్ అవుతున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.