Begin typing your search above and press return to search.

స్టార్ట‌ప్ పెట్టి ఎద‌గాలా....అమిత్‌ షా ను అడ‌గండి

By:  Tupaki Desk   |   11 Oct 2017 5:59 AM GMT
స్టార్ట‌ప్ పెట్టి ఎద‌గాలా....అమిత్‌ షా ను అడ‌గండి
X

ఇదేం విడ్డూరం? ఇదేం కామెంట్‌? ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ అత్యంత ఆప్తుడు - బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అయిన అమిత్‌ షా ప‌క్కా రాజ‌కీయ నాయ‌కుడిగా ఫుల్ బిజీగా ఉన్న స‌మ‌యంలో....ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌కు శిక్ష‌ణ ఇస్తారా? పైగా ఆయ‌న త‌న‌యుడి వ‌ద్ద‌కు వెళ్లి మ‌నం స్టార్ట‌ప్ పాఠాలు నేర్చుకోవాలా? అస‌ల‌ది సాధ్య‌మ‌య్యేదేనా అని అనుకోకండి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకు జయ్‌ షా వ‌ద్ద ఇలా పాఠాలు చెప్పించేంది ఏదో స్వ‌చ్ఛంద సంస్థ లేదంటే స్వ‌యంగా జ‌య్ షా కాదు...పంచ్ రూపంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షులు రాహుల్‌ గాంధీ.

జయ్‌ షా కంపెనీ అయిన `టెంపుల్‌ ఎంటర్‌ ప్రైజెస్‌` ఆదాయం ఏడాది కాలంలోనే 16 వేల రెట్లు పెరిగినట్టు ఓ ఆంగ్ల మీడియా సంస్థ బహిర్గతపరచిన సంగతి తెలిసిందే. రూ.50 వేలు ఉన్న కంపెనీ ఆదాయం రూ.80 కోట్లకు చేరిందని వివరించింది. కాగా వడోదరలో జరిగిన సభలో కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ ఈ ప‌రిణామాన్ని ఎద్దేవా చేశారు. అటు అమిత్‌ షాను - ఇటు మోడీని లక్ష్యంగా చేసుకుని తీవ్రవిమర్శలు సంధించారు. మోడీ సర్కారు ప్రవేశ పెట్టిన స్టార్టప్‌ ఇండియా పథకానికి ఐకాన్ జ‌య్ షా అని ఎద్దేవా చేశారు. అమిత్ షా నుంచి ఆయ‌న త‌న‌యుడి నుంచి పాఠాలు నేర్చుకోవ‌చ్చున‌ని వ్యాఖ్యానించారు. బడా పారిశ్రామికవేత్తలను సృష్టించే లక్ష్యంతో స్టార్టప్‌ ఇండియాను తీసుకొచ్చారని, ఇది మోడీ పెట్‌ స్కీమ్‌(పెంపుడు పథకం) అని విమర్శలు గుప్పించారు. అవినీతిని సహించేది లేదని పదేపదే చెబుతున్న మోడీ.. జయ్ షా వ్యవహారంపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. కాపలాదారు (మోడీ) కండ్లముందే దొంగతనం జరిగిపోయిందని వ్యంగ్యంగా అన్నారు. నువ్వు కాపలాదారువా? తోడుదొంగ వా? అని నిలదీశారు. జయ్‌ షాకు మద్దతుగా మాట్లాడుతున్న కేంద్రమంత్రులను - బీజేపీ నేతలను కూడా రాహుల్ దుయ్యబట్టారు.

బేటీ బచా వో బేటీ పడావో కార్యక్రమం పేరును అమిత్‌ షా కే బేటేకో బచావ్ గా మార్చాలని చురకలు వేశారు. ప్రధాని మోడీ విధానాల వల్ల అన్నిరంగాలు దెబ్బతిన్నాయని, అందులోంచి జయ్ కంపెనీ ఒక్కటే పైకి లేచిందని అన్నారు. జయ్‌ షా కంపెనీ పెట్టుబడులు 16 వేల రెట్లు పెరిగాయని రాహుల్ అన్నారు. దేశానికి కాపలాదారును అని చెప్పుకునే ప్రధాని మోదీ దీనిపై ఎందుకు మౌనం వహిస్తున్నారని నిలదీశారు. జయ్‌ విషయంలో వస్తున్న ఆరోపణలపై మోడీ, అమిత్‌ షాలు వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.