Begin typing your search above and press return to search.
ఆ 60 రోజులు రాహుల్ ఎక్కడేం చేశారంటే..?
By: Tupaki Desk | 25 Nov 2015 5:17 AM GMTఅదేం చిత్రమో కానీ.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ యవ్వారం మహా సిత్రంగా ఉంటుంది. తాను ప్రజల మనిషినని చెప్పుకోవటమే కాదు.. తాను చెప్పే మాట నిజమని చెప్పేందుకు పేదోళ్ల ఇళ్లకు వెళ్లటం.. వారి ఇంట్లో భోజనం లాంటివి చేస్తారు. గాంధీ ఫ్యామిలీకి చెందిన వ్యక్తి పేదోళ్ల ఇంటికి వచ్చి భోజనం చేసేంత సింఫులా అని అనుకున్నంతలో.. చెప్పాపెట్టకుండా సీక్రెట్ ట్రిప్పులకు వెళ్లిపోతుంటారు. రాజకీయ నాయకుడు అన్న తర్వాత వ్యక్తిగత విషయాలు అంటూ ఉండవా? తనదైన లోకంలో కొంతకాలం గడిపే స్వేచ్ఛ కూడా ఉండదా అని ప్రశ్నించొచ్చు. నిజానికి అలా ఉండొద్దని ఎవరూ అనరు. కాకుంటే.. అలా వెళ్లే సమయంలో తాను వెళుతున్న దేశం చెప్పినంత మాత్రాన కొంపలు మునగవు.
ఒకవేళ భద్రతా కారణాలు అని అనుకుంటే.. వచ్చిన తర్వాత అయినా చెప్పొచ్చు. కానీ.. దాన్నో రాజకోట రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఉండదు. దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు. వారు చాలాసార్లు విదేశీ పర్యటనలు చేస్తుంటారు. తాము విదేశాలకు వెళ్లే విషయాన్ని చెప్పుకోవటానికి ఏ మాత్రం సందేహించరు.. సంశయించరు. కానీ.. రాహుల్ భయ్యా మాత్రం కాస్తంత భిన్నం. అందరితో ఉన్నట్లుగానే ఉంటూనే.. తాను యువరాజునన్న విషయాన్ని తన చేతలతో చేసి చూపిస్తుంటారు.
ఆ మధ్య దాదాపు రెండు నెలల పాటు దేశంలో లేకుండా.. లాంగ్ లీవ్ తీసుకొని మరీ విదేశీ యాత్రకు వెళ్లిన రాహుల్ ఎక్కడికి వెళ్లారు.. ఏం చేశారన్న అంశంపై పెద్ద సస్పెన్స్ నడిచింది. ఆయన పర్యటన ముగించుకొచ్చిన తర్వత కూడా తన యాత్ర గురించి రాహుల్ పెదవి విప్పలేదు. కాంగ్రెస్ నేతలు సైతం మాట్లాడలేదు. దేశంలో ఉండకుండా వెళ్లిన రాహుల్ కు సంబంధించి 56 రోజులు (మీడియాలో వచ్చింది ఇదే అయినా.. వాస్తవానికి ఆయన 60 రోజులు దేశంలో లేరన్న విషయం తాజా లెక్కలో తేలింది) అసలేం జరిగిందన్నది పెద్ద గుట్టుగా ఉండిపోయింది.
తాజాగా.. రాహుల్ జరిపిన రహస్య పర్యటనకు సంబంధించిన విశేషాలు బయటకు వచ్చాయి. రెండు నెలల పాటు దేశంలో లేకుండా.. పార్లమెంటు సమావేశాలకు హాజరు కాకుండా గుట్టుగా చేసిన యాత్రకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.
ఇక.. ఆయన ప్రయాణ షెడ్యూల్ చూస్తే..
ఫిబ్రవరి 16; న్యూఢిల్లీ నుంచి బయలుదేరి థాయ్ లాండ్ రాజధాని బ్యాంకాక్ అదే రోజు వెళ్లారు
ఫిబ్రవరి 17; ఫిబ్రవరి 16 నుంచి 17 వరకు బ్యాంకాక్ లోనే ఉండి.. అదే రోజు కంబోడియాకు ప్రయాణం జర్నీ
ఫిబ్రవరి 28 ; ఫిబ్రవరి 17 నుంచి 11 రోజులు (ఫిబ్రవరి 28 వరకు) కంబోడియాలోనే ఉన్నారు
ఫిబ్రవరి 28 ; కంబోడియా నుంచి తిరిగి బ్యాంకాక్ కు వచ్చారు
ఫిబ్రవరి 28 ; బ్యాంకాక్ లో ఉండిపోయారు
మార్చి 1 ; మయన్మార్ కు వెళ్లి.. 21 రోజులు (మార్చి 22 వరకు) ఉండిపోయారు
మార్చి 22 ; మయన్మార్ నుంచి థాయ్ ల్యాండ్ కు వెళ్లారు.
మార్చి 22 ; థాయ్ ల్యాండ్ లోని బుద్ధిస్ట్ హెరిటేజ్ సెంటర్ కు వెళ్లారు. అక్కడే 9 రోజులున్నారు
మార్చి 31 ; వియత్నాం వెళ్లారు. దాదాపు 12 రోజులు గడిపారు
ఏప్రిల్ 12 ; బ్యాంకాక్ కు తిరిగి వచ్చారు. 5 రోజులు అక్కడే ఉన్నారు
ఏప్రిల్ 16 ; బ్యాంకాక్ నుంచి బయలుదేరి న్యూఢిల్లీ చేరుకున్నారు.