Begin typing your search above and press return to search.
రఫేల్ పై మరో బాంబు పేల్చిన రాహుల్!
By: Tupaki Desk | 12 Feb 2019 8:25 AM GMTతనకు మించిన సుద్దపూస దేశంలో మరెక్కడా ఉండరని.. అవినీతికి తాను బద్ధ శత్రువునని.. దేశానికి కాపలాదారుగా తనను తాను చెప్పుకునే ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫెల్ డీల్ ఆరోపణలు చేయటం తెలిసిందే. ఏ ముహుర్తంలో మొదలైందో కానీ.. రఫెల్ కు సంబంధించిన కొత్త విషయాలు ఎప్పటికిప్పుడు బయటకు రావటం.. సంచలనంగా మారటం.. మోడీ పరివారం ఆత్మరక్షణలో పడటం జరుగుతోంది.
తాజాగా అలాంటిదే మరొకటి బయటకు వచ్చింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని మోడీపై మరో సంచలన ఆరోపణ సంధించారు. రఫేల్ విషయంలో అంబానీ.. ఫ్రాన్స్ ప్రభుత్వానికి మధ్యవర్తిగా మోడీ వ్యవహరించినట్లుగా ఆయన ఆరోపించారు. ఎందుకిలాఅంటే.. ఈ రోజు ఒక ప్రముఖ మీడియా సంస్థలో వచ్చిన సంచలన కథనంతో ఆయనీ ఆరోపణ చేశారు.
రఫేల్ డీల్ కు సంబందించి ది హిందూ మీడియా సంస్థ సంచలన కథనాన్ని ప్రచురిస్తే.. తాజాగా మరో మీడియా సంస్థ మరో అంశాన్ని తెర మీదకు తెచ్చింది. సదరు మీడియా సంస్థ కథనం ప్రకారం రాఫేల్ డీల్ కు ముందు అనిల్ అంబానీ ఫ్రాన్స్ రక్షణ మంత్రిని కలిసినట్లుగా ఒక కథనం మీడియాలో వచ్చింది.
తాజా కథనాన్ని సింఫుల్ గా చెబితే .. రఫేల్ డీల్ కు ముందు ఫ్రాన్స్ రక్షణ మంత్రిని అనిల్ అంబానీ కలిసారు. ఒప్పందానికి పది రోజుల ముందే ఫ్రాన్స్ రక్షణ మంత్రి ఎందుకు కలిశారు? ఏ హోదాలో కలిశారు? దేశ రక్షణ వ్యవహారాల్లో రహస్యంగా ఉంచాల్సిన అంశాలు బయటకు ఎలా వచ్చాయి? అన్నది ఇప్పుడు ప్రశ్నలుగా మారాయి. రఫేల్ ఒప్పందం గురించి రక్షణశాఖకు.. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ కు.. విదేశాంగ కార్యదర్శికి తెలియటానికి ముందే అనిల్ అంబానీకి సమాచారం ఎలా చేరిందన్న ప్రశ్నలు ఇప్పుడు మోడీ సర్కారుకు చెమటలు పట్టిస్తున్నాయి. మరీ.. ప్రశ్నలకు మోడీ అండ్ కో ఏం సమాధానం ఇస్తుందో చూడాలి.