Begin typing your search above and press return to search.

5 వేల‌కోట్లిస్తా..దోపిడీకి కొత్త అర్ధం చెప్పిన రాహుల్

By:  Tupaki Desk   |   15 Feb 2018 11:54 AM GMT
5 వేల‌కోట్లిస్తా..దోపిడీకి కొత్త అర్ధం చెప్పిన రాహుల్
X
దేశంలో అతిపెద్ద రెండో బ్యాంకింగ్ సంస్థ అయిన పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ లో రూ.11,436కోట్లు కుంభ‌కోణం జ‌ర‌గ‌డం సంచ‌ల‌న‌మైంది. బ్యాంకింగ్ సంస్థ‌లు - వ్యాపార‌స్థుల మ‌ధ్య త‌రుచుగా వినిపించే బ‌య్య‌ర్స్ క్రెడిట్ ను అడ్డుగా పెట్టుకొని ప్ర‌ముఖ వజ్రాల వ్యాపారి నీర‌వ్ మోడీ ఈ మోసానికి తెర‌తీశాడు. జ‌న‌వ‌రి 16న నీరవ్ మోడీ - ఆయన సోదరుడు నిశాల్ మోడీ - నీరవ్ భార్య అమీ నీరవ్ మోడీ - మరో వ్యాపార భాగస్వామి మెహుల్ చినూభాయ్ చోక్సీకి సంబంధించిన కంపెనీలు డైమండ్ ఆర్‌ యుఎస్ - సోలార్ ఎక్స్‌ పోర్ట్స్ - స్టెల్లార్ డైమండ్స్ లు త‌మ‌కు బ‌య్య‌ర్స్ క్రెడిట్ కావాల‌ని ముంబైలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ అధికారుల్ని కోరాయి. ఈ బ‌య్య‌ర్స్ క్రెడిట్ ద్వారా విదేశాల నుంచి ఎగుమ‌తి దిగుమ‌తి చేసుకునే వ్యాపారస్థుల‌కు బ్యాంకులు స్వ‌ల్ప కాలిక రుణ స‌దుపాయాన్ని క‌ల్పిస్తాయి. అయితే నీర‌వ్ మోడీ త‌మ‌కు విదేశాల‌నుంచి స‌రుకు వ‌స్తుంద‌ని , అందుకు సంబంధించిన పత్రాలు స‌మ‌ర్పిస్తామ‌ని సూచించాడు. అవ‌స‌ర‌మైన రుణం పొందేందుకు హామీగా ఇచ్చే లెట‌ర్స్ ఆఫ్ అండర్‌ టేకింగ్(ఎల్ ఓయూ- ఏ దేశం నుండి అయినా స‌రుకును ఎగుమ‌తి చేసుకునే వారికి దిగుమ‌తి వారి త‌రుపు నుంచి ఇచ్చే గ్యారెంటీ ) కావాలని విజ్ఞప్తి చేశాయి.

దీనికి ఆ బ్యాంక్ సంబంధిత శాఖా అధికారులు త‌మ‌కు 100% క్యాష్ మార్జిన్ కావాల‌ని కోరాయి. దీంతో నీర‌వ్ మోడీ సంస్థ‌లు తాము గ‌తంలో ఎల్ ఓయూ లు లేకుండా రుణాన్ని పొందిన‌ట్లు చెప్పారు. ఎల్ ఓయూ లు లేకుండా రుణాన్ని ఎలా పొందాయని పీఎన్బీ ఉన్న‌తాధికారులు అనుమానం వ్య‌క్తం చేస్తూ లోతుగా విశ్లేషించ‌గా రూ. 11,436 కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కుంభ‌కోణానికి బ్యాంకు అధికారులు వంత‌పాడ‌డం ప‌రిపాటి అయ్యింది.

స‌ద‌రు సంస్థ‌ల‌కు ఎల్ ఓయూలు ఇచ్చిన‌ట్లు బ్యాంకు రికార్డుల్లో లేక‌పోవ‌డం అనుమానం బ‌ల‌ప‌డింది. దీనికి తోడు బ్యాంకిగ్ లో ‘స్విఫ్ట్' అనే మెసేజింగ్ సిస్టం నుంచి పీఎన్బీ బ్యాంకు ఉద్యోగులు హాంకాంగ్‌ లోని అలహాబాద్ బ్యాంకుకు ఐదు మెసేజ్‌ లు - యాక్సిస్ బ్యాంకుకు నీరవ్ మోడీ తదితరుల సంస్థలకు బయ్యర్స్ క్రెడిట్ పెంచినట్లుగా స‌మాచారం అందించారు. దీనికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లేక‌పోవ‌డంతో సంబంధిత బ్యాంకు ఉద్యోగుల్ని నిల‌దీయ‌గా నీళ్లు న‌ములుతు స‌మాధానం చెప్పారు.

దీంతో పీఎన్బీ ఉన్న‌తాధికారులు ముంబై బ్రాడీహౌస్‌ లోని తమ మిడ్ కార్పొరేట్ బ్రాంచిలో కొన్ని మోసపూరిత లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్స్ లభించినట్లు సీబీఐ అధికారుల‌కు ఫిర్యాదు చేశారు. ఈ మోసంలో పాలు పంచుకున్న బ్యాంక్ డిప్యూటీ మేనేజ‌ర్ తో స‌హా 10మందిని విధుల నుంచి తొల‌గించారు.

అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సీబీఐ - ఈడీ - సెబీ నీర‌వ్ మోడీ 11 కార్యాల‌యాల్లో విచార‌ణ చేప‌ట్ట‌గా నీర‌వ్ మోడీ రెండు సార్లు మోసానికి పాల్ప‌డ్డ‌ట్లు తేలింది. ఈ నెల 5న నీరవ్ మోడీ తమ బ్యాంకును రూ.280 కోట్లు - ఇప్పుడు రూ.11,436కోట్ల కుంభ‌కోణం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కుంభ‌కోణం పై ఆరోప‌ణ‌లు రావ‌డంతో నీర‌వ్ మోడీ స్విట్జ‌ర్ లాండ్ కు చెక్కేసినట్లు విదేశాంగ శాఖ అనుమానం వ్య‌క్తం చేసింది. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంక్ ఇచ్చిన గ్యారంటీతో నీర‌వ్ మోడీ ఆరు బ్యాంకుల నుంచి రుణం పొందాడ‌ని తేల్చిచెప్పింది. ఓ వైపు దాడులు జ‌రుగుతుండ‌గా విదేశాల్లో ఉన్న మోడీ తాను రూ. 5వేల‌కోట్లు చెల్లించ‌డానికి సిద్ధంగా ఉన్నాన‌ని భార‌త ప్ర‌భుత్వానికి చెప్పిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

పీఎన్బీఐ కుంభ‌కోణంపై ప్ర‌తిప‌క్షాలు - లెఫ్ట్ పార్టీలు పీఎం మోడీ పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధిస్తున్నాయి. జ‌న‌వ‌రి 3న బ్యాంకులో కుంభ‌కోణం జ‌రిగితే జ‌న‌వ‌రి 22/23న స్విట్జ‌ర్ లాండ్ దావోస్ లో జ‌రిగిన స‌మావేశంలో మోడీ - నీర‌వ్ మోడీ క‌లిసి ఉన్న ఫోటోల్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత‌లు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మోడీ స్పందించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మోడీకి విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ దేశాన్ని ఎలా దోచుకుంటున్నారని అర్ధం వ‌చ్చేలా కొన్ని అంశాల్ని పోస్ట్ చేశారు.

1. పిఎం మోడీని నీర‌వ్ మోడీ కౌగలించుకోవడం

2. స్విట్జ‌ర్లాండ్ దావోస్ లో జ‌రిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశంలో ప్రధానితో దావోస్‌లోనూ కనిపించడం.

ఎ. రూ.12,000 కోట్లు దోచుకోవడం

బి. ప్రభుత్వం ఎటో చూస్తుండగా, మాల్యా మాదిరిగా దేశం విడిచి జారుకోవడం. ఒక మోడీ నుంచి మరో మోడీ... అని ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీరవ్ మోడీ - పీఎం మోడీ క‌లిసి ఉన్న ఫోటోల్ని పోస్ట్ చేసిన ఆయ‌న పీఎన్బీ ప్ర‌ధాన సూత్ర‌దారుడు నీర‌వ్ మోడీ ప‌రారీపై మోడీ వివరణ ఇవ్వాలనిఅన్నారు. బ్యాంకులను మోసం చేసి విదేశాలకు పారిపోవడంలో ఓ పద్ధతిని పాటిస్తున్నారని దుయ్య‌బ‌ట్టారు.