Begin typing your search above and press return to search.
ఈ రాహుల్ గాంధీని ఎవడూ మార్చలేడేమో..?
By: Tupaki Desk | 20 July 2016 10:47 AM GMT రాజకీయాల్లో మైలేజి పొందడానికి ఏ చిన్న ఛాన్సు వచ్చినా ఎవరూ వదులుకోరు. అలాంటిది దేశంలో చచ్చిన పాములా మారిన కాంగ్రెస్ ను తిరిగి లేపడానికి - పాలక బీజేపీని ఇరుకున పెట్టడానికి మంచి ఛాన్సు దొరికినా కూడా కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ మాత్రం అదేమీ పట్టించుకోకుండా తన పనిలో తాను మునిగిపోయారు. గుజరాత్ లో దళితులపై దాడుల విషయంలో పార్లమెంటులో కాంగ్రెస్ ఎంపీలు చర్చిస్తున్న సమయంలో ఆ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ మాత్రం హాయిగా నిద్రపోయారు. ఆ సమయంలో కాంగ్రెస్ ఎంపీలు గుజరాత్ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ గందరగోళాన్ని సృష్టించారు. అతి ముఖ్యమైన అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ మాత్రం కునుకు తీశారు. దీంతో కాంగ్రెసేతర విపక్షాలు వీడెవడండీ బాబూ.. అంటూ మండిపడుతున్నారు.
ఇటీవల గుజరాత్ లోని ఉనాలో నలుగురు దళిత యువకులను గోమాంసం పంపిణీ చేస్తున్నారంటూ గోసంరక్షణ సంస్థ సభ్యులు చితక్కొట్టిన ఘటన తెలిసిందే. నలుగురు యువకులను పట్టుకున్న గోసంరక్షణ సంస్థ సభ్యులు వారిని అర్ధనగ్నంగా మార్చి - ఓ కారుకి వారి చేతులని కట్టేసి కొట్టారు. ఈ సందర్భంగా అక్కడ ఓ వ్యక్తి తీసిన ఈ ఘటన దృశ్యాలు దేశమంతటా కలకలం రేపాయి. ఈ అంశంపైనే ఈరోజు పార్లమెంటు ఉభయసభల్లో రగడ కొనసాగుతోంది. ఆ రాష్ట్రంలోనే కాక దేశ వ్యాప్తంగా దళితులపై దాడులు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో గళం విప్పుతున్నాయి. ఇటువంటి ఘటనలకు పాల్పడుతోన్న నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. దళిత యువకులపై దాడిపై రాజ్యసభలో చర్చించాల్సిందేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. అయితే దానికి ఛైర్మన్ నుంచి అనుమతి రాకపోవడంతో బీఎస్పీ ఎంపీలు వెల్ లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఈరోజు రాజ్యసభ నాలుగుసార్లు వాయిదా పడింది.
గుజరాత్ లో దళితులపై దాడి అంశంలో లోక్ సభలో కేంద్రం హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటన చేశారు. దళితులపై జరిగిన దాడిని ఖండించాల్సిందేనని ఆయన అన్నారు. ప్రధాని మోదీ కూడా ఈ అంశం పట్ల విచారం వ్యక్తం చేశారని - ఘటనను తీవ్రంగా తీసుకున్నారని - ఇటువంటి దాడులు సాంఘిక నేరమని ఆయన వ్యాఖ్యానించారు. దేశ ప్రజలు ఇటువంటి సమస్యలను సవాలుగా తీసుకోవాలని - వాటి నిర్మూలనకు కృషి చేయాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా గుజరాత్ లో దళితులపై భారీ సంఖ్యలో ఇటువంటి దాడులు జరిగాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో జరిగిన దాడుల కన్నా బీజేపీ సర్కార్ పాలనలో జరిగిన దాడులు తక్కువేనని, వాటిని ప్రభుత్వం అరికట్టగలిగిందని అన్నారు. కాంగ్రెస్ పై రాజ్ నాథ్ సింగ్ చేసిన ఆరోపణల పట్ల, దళితులపై దాడుల అంశంపై ఆయన చేసిన ప్రకటన పట్ల కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను హోంమంత్రి మరింత పెద్దదిగా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు రాహుల్ గాంధీ హ్యాపీగా పార్లమెంటులోనే నిద్రపోయారు. మోడీ సొంత రాష్ట్రంలో - భాజపా పాలనలో ఉన్న గుజరాత్ లో దళితులు ఇన్ని కష్టాలు పడుతుంటే .. పార్లమెంటులో దానిపై చర్చ వాడివేడిగా జరుగుతుంటే కునుకు తీసే వ్యక్తి కాంగ్రెస్ పార్టీని ఎలా బతికించగలరని ఆ పార్టీ నేతలు కూడా అంటున్నారు.