Begin typing your search above and press return to search.
ఆంధ్రాలో రాహుల్‌బాబు ఏం చెప్పాడంటే..
By: Tupaki Desk | 24 July 2015 9:22 AM GMTకాంగ్రెస్ యువరాజు ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలను పరామర్శించేందుకు అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న ఆయన.. కష్టాల్లో ఉన్న రైతుల్ని ఆదుకునేందుకే వచ్చానని చెప్పటమే కాదు.. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా కోసం ఏపీ అధికార.. విపక్షం ఎందుకు పోరాటం చేయటం లేదన్న రాహుల్ తమ పార్టీ గురించి మాత్రం మాట్లాడలేదు. తన నానమ్మ ఇందిర గురించి ప్రస్తావించి.. సెంటిమెంట్ సెంట్ రాసేందుకు ప్రయత్నించిన ఆయన ఇంకా ఏం మాట్లాడరంటే..
- రైతాంగం కష్టాలు తీరేవరకూ పోరాడుతాం.
- కష్టాల్లో ఉన్న రైతులకు భరోసా కల్పించేందుకే వచ్చా.
- రైతు కుటుంబాలు ఎంత బాధలో ఉన్నాయో తెలుసు. వారికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది.
- ప్రభుత్వం రైతులు, పేదల బతుకులకు మోడీ సర్కారు అండగా ఉండటం లేదు.
- రైతుల భూములు బలవంతంగా తీసుకోకుండా మేం చట్టం తెచ్చాం.
- మోడీ సర్కారు మాత్రం రైతన్నల భూములు లాక్కోడానికి చట్టం తేవాలని చూస్తోంది.
- పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకే భూసేకరణ బిల్లును తీసుకువస్తున్నారు. ఈ బిల్లు విషయంలో వాళ్లు వెనక్కి తగ్గాల్సిందే.
- ప్రజలు తననేమీ చేయలేరని మోదీ అనుకుంటున్నారని.. తగిన గుణం పాఠం చెబుతాం.
- ఏపీకి ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు. కాంగ్రెస్ ఇచ్చిన ప్రత్యేక హోదాను వెనక్కి లాక్కున్నారు.
- ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు పోరాటం చేయటం లేదు.
- ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు ఎందుకు భయపడుతున్నారు? మోడీని ఎందుకు ప్రశ్నించటం లేదు?
- కాంగ్రెస్ మాత్రం ఎవరికీ భయపడదు.. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం.
- ప్రత్యేక హోదా.. పోలవరం ప్రాజెక్టు పోరాటంలో ఏపీ ప్రజలతో కలిసి వస్తాం.
- ఆంధ్రాతో ఇందిరాగాంధీకి ఉన్న అనుబంధమే నాకు ఉంది.
- ఏపీ అగ్రగామిగా ఉండాలంటే ప్రత్యేక హోదా.. పోలవరం అవసరం.
- ఏపీ ప్రజల భవిష్యత్ కోసం తెలుగుదేశం.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల మాదిరి రాజీ పడం.