Begin typing your search above and press return to search.
రాహుల్ లాజిక్...తెలంగాణ పౌరులకు 2 లక్షలొస్తాయి
By: Tupaki Desk | 28 Nov 2018 11:50 AM GMTఒక్క చాన్స్. ఒకే ఒక్క ఛాన్స్.. అంటూ రాహల్ దేశమంతా తిరుగుతున్నారు. ఆయన ఆధ్వర్యంలో అనేక రాష్ట్రాల్లో ప్రచారం జరిగినా ఏ ఎన్నికలోనూ స్వతంత్రంగా పార్టీ అధికారంలోకి రాలేదు. కాకపోతే అనుభవం మాత్రం సంపాదించుకున్నారు. ఇపుడు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అయినా ఓ రెండింటిలో అయినా అధికారం దక్కకపోతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. మధ్యప్రదేశ్ - తెలంగాణలపై రాహుల్ కు భారీ ఆశలున్నాయి. కాకపోతే టీడీపీతో వారికి జరగబోయే నష్టం అంచనా వేయడంలోనే రాహుల్ విఫలమైనట్టున్నారు. అయినా ప్రచారంలో మాత్రం దూసుకుపోతున్నారు.
ఇటీవల రాహుల్ మాటల్లో పంచ్ లు పేలుతున్నాయి. తాజాగా టీఆర్ ఎస్ పై అలాంటి పంచ్ ఒకటి పేల్చాడు రాహుల్ గాంధీ. బీజేపీకి టీఆర్ ఎస్ బి-టీం అని పేర్కొన్న రాహుల్... టీఆర్ ఎస్ అంటే *తెలంగాణ రాష్ట్రీయ సంఘ్ పరివార్* అని నిర్వచించారు. ఒకవైపు నరేంద్రమోడీ వచ్చి టీఆర్ ఎస్ కాంగ్రెస్ ఒకటే అని అంటుంటే... రాహుల్ ఏమో బీజేపీ-టీఆర్ ఎస్ ఒకటే అంటున్నారు. మొత్తానికి ఈ ఇద్దరు విమర్శలతో జనాలకు అయోమయం కలిగింది. ఎవరు ఎవరివైపో అర్థం కాని పరిస్థితి ఉంది.
తెలంగాణ బడ్జెట్ రెండు లక్షల కోట్లు. అంటే ప్రతి ఇంటికి రెండు లక్షలు రూపాయలు ఖర్చు చేసేంత డబ్బుంది. కానీ కేసీఆర్ ప్రతి తలపై 60 వేల అప్పు మోపాడు... అంటూ రాహుల్ కొత్త లెక్కచెప్పారు. మరి బడ్జెట్ అంతా జనాలకు పంచితే సామాజిక - మౌలిక సౌకర్యాలు ఏ డబ్బులతో నిర్వహిస్తారో కూడా రాహుల్ చెప్పాల్సింది. ఇదే కదా అనుభవరాహిత్యం అంటే!
ఈ రోజు చంద్రబాబు తో కలిసి రాహుల్ పలుసభలకు హాజరయ్యారు. తెలంగాణలో ప్రజాకూటమి హవా కొనసాగుతోంది. ఎన్నికల తర్వాత కేసీఆర్ గద్దె దిగడం ఖాయం. ప్రజాకూటమి అధికారంలోకి వచ్చిన తరువాత తాము ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం. ప్రజాకూటమి ముఖ్యమంత్రి తెలంగాణ యువకుల ఆశయాలకు అనుగూణంగా పని చేస్తారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. మరి రాహుల్ ప్రభావం తెలంగాణపై ఎంత ఉంటుందో తేలడానికి ఎంతో సమయం పట్టదు.