Begin typing your search above and press return to search.

డీకే, సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్

By:  Tupaki Desk   |   22 July 2021 7:31 AM GMT
డీకే, సిద్దరామయ్యకు రాహుల్ గాంధీ స్ట్రాంగ్ వార్నింగ్
X
కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ కీలక నేత , రాహుల్ గాంధీ కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డికె శివకుమార్, శాసనసభ పార్టీ నాయకుడు సిద్దరామయ్య కలిసి పనిచేయాలని కోరినట్లు కార్యకర్తలు వెల్లడించారు.

ఇద్దరు సీనియర్ సభ్యులు 2023 అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ ముఖం ఎవరు అనే దానితో సహా అనేక సమస్యలపై వీరిద్దరి మధ్య విబేధాలు ఉన్నాయి. కర్నాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్, మాజీ సీఎం సిద్దరామయ్య పంచాయితీ ఢిల్లీకి చేరింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం కాస్త కటువుగానే స్పందించింది.

ఇద్దరిలో ఏ ఒక్కర్నీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించమని తేల్చి చెప్పింది. వీరిద్దరూ కలిసి పనిచేయాల్సిందేనని కర్నాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ రణదీప్ సూర్జేవాలా తేల్చి చెప్పారు. డీకే, సిద్దరామయ్య మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో సిద్దరామయ్య, డీకేను ఢిల్లీకి పిలిపించింది అధిష్ఠానం. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ వీరిద్దరితో సమావేశమయ్యారు.

ఇద్దరిలో ఏ ఒక్కరికీ అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరగదని, ఇద్దర్నీ సమానంగానే చూస్తామని రాహుల్ కూడా తేల్చి చెప్పారు. సామూహిక నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికలపై పోరాడాలని రాహుల్ శివకుమార్ మరియు సిద్దరామయ్యలను ఆదేశించినట్లు తెలిసింది, తమను ముఖ్యమంత్రి అభ్యర్థిగా చూపించకుండా హెచ్చరించింది.

పంజాబ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే అధిష్ఠానం ఇంత కటువుగా మాట్లాడినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై డీకే శివకుమార్ స్పందించారు. కర్నాటకలో ఎలాంటి వైరుద్ధ్యాలూ లేవని స్పష్టం చేశారు. ఉమ్మడిగా, కలిసే ముందుకు సాగుతామని తెలిపారు. రాహుల్ గాంధీ మాకు కొన్ని సలహాలు ఇచ్చారు, మేము హృదయపూర్వకంగా అనుసరిస్తాము.

ఖచ్చితంగా, చిన్న అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కాంగ్రెస్‌కు బలమైన అంతర్గత ప్రజాస్వామ్యం ఉంది. అభిప్రాయ భేదం కలిగి ఉండటం ప్రజాస్వామ్య ఏర్పాటులో భాగం, కాని మేము ఐక్యంగా ఉంటాం అని సిద్దరామయ్య విలేకరుల సమావేశంలో అన్నారు.