Begin typing your search above and press return to search.
ప్రియాంక డాటర్ తో రాహుల్ గాంధీ ముచ్చట్లు
By: Tupaki Desk | 21 Aug 2015 9:16 AM GMTఈ ఫొటోలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, యువరాజు రాహుల్ గాంధీతో మాట్లాడుతున్న అమ్మాయి ఎవరో తెలుసా...ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి స్వయానా మనవరాలు. సోనియా మనవరాలంటే ఎవరనుకుంటున్నారా...రాబర్ట్ వాద్రా, ప్రియాంక కుమార్తె మిరయా వాద్రా. రాహుల్ మేనకోడలైన మిరయా వాద్రా రాజీవ్ గాంధీ 71వ జయంతి సందర్భంగా నివాళులు అర్పించే కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
రాజీవ్ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలో ఉన్న రాజీవ్ సమాధి వీర్ భూమి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మిరయా తన మేనమామ రాహుల్ పక్కనే కూర్చుని చాలా సేపు ముచ్చట్లు పెట్టింది. వీరిద్దరు మాటల్లో మునిగితేలుతుంటే పక్కనున్న వారు ఈ మేనమామ-మేనకోడలు అంతసేపు ఏం మాట్లాడుకున్నారా అని గుసగుసలాడుకున్నారు.
వీరిద్దరి ముచ్చట్లను తమ కెమేరాల్లో బంధించేందుకు ఫొటో గ్రాఫర్లు పోటీ పడి మరీ క్లిక్ మనిపించారు. రాహుల్ ఎలా ఉన్నా భవిష్యత్తులో కాంగ్రెస్ రథసారధిగా ప్రియాంక అయితేనే కరెక్ట్ అన్న వ్యాఖ్యలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. రాజీవ్ నాయకత్వ లక్షణాలు, పోరాటపటిమ ప్రియాంకలో మెండుగా ఉన్నాయని కాంగ్రెస్ సర్కిల్స్ లో టాక్ వినపడుతోంది. ప్రియాక కాంగ్రెస్ పగ్గాలు చేపడితే ఆమెలాగానే ఆమె కుమార్తె మిరయా కూడా భవిష్యత్తులో కాంగ్రెస్ నాయకురాలవుతుందేమో చూడాలి.