Begin typing your search above and press return to search.
థింక్ బిగ్ రాహుల్! మరీ 200 సీట్లు లక్ష్యమా?
By: Tupaki Desk | 23 July 2018 10:53 AM GMT2019 ఎన్నికల్లో 200 సీట్లు గెలవడం కాంగ్రెస్ లక్ష్యమని.. ఆపై మిత్రపక్షాల సహకారంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ చెప్పడంపై బీజేపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. వారు లక్ష్యమే అంత తక్కువగా పెట్టుకోవడం.. మిత్రపక్షాలపై ఆధారపడతామని ముందే చెప్పడం వచ్చే ఎన్నికల్లో మళ్లీ 2014 నాటి ఫలితమే రిపీట్ అవుతుందనడానికి సంకేతమని అంటున్నారు.
200 సీట్లు లక్ష్యంగా పెట్టుకున్నారంటే వారి అంచనా ఇంకా తక్కువే ఉండొచ్చు. మరోవైపు ప్రస్తుతం యూపీఏ కూటమిని చూసుకుంటే కాంగ్రెస్ మినహా ఇంకే పార్టీకి కూడా పట్టుమని పది సీట్లు లేవు. కేవలం ఎన్సీపీకి 7 సీట్లున్నాయి. ఇక ఆర్జేడీ 3 సీట్లతో ఆ తరువాత స్థానంలో ఉంది. జేఎంఎం - ముస్లిం లీగ్ లకు రెండేసి సీట్లున్నాయి. మిగతావాటిలో సగం సింగిల్ సీట్ పార్టీలైతే ఇంకొన్నిటికి ఆ భాగ్యమూ లేదు.
పోనీ ఇందులో ఏ పార్టీయైనా వచ్చే ఎన్నికల్లో అద్భుతాలు సృష్టిస్తుందా అంటే అదీ లేదు. అయితే గియితే ఆర్జేడీ వచ్చే ఎన్నికల్లో తన సీట్లు పెంచుకోవచ్చు. డీఎంకే - జేడీఎస్ సీట్లూ పెరగొచ్చు. ఇక కొత్తగా యూపీఏలోకి ఏ పార్టీయైనా వస్తుందా అంటే అది నిశ్చితంగా చెప్పలేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీ ఏమైనా సహకారం ఇస్తే ఇవ్వొచ్చు కానీ మిగతా ఏ పార్టీ కాంగ్రెస్ తో కలిసే పరిస్థితి లేదు. బీజేపీకి దూరమవుతున్న శివసేన కాంగ్రెస్ వైపు చూడ్డం అనుమానమే. ఈ పరిస్థితుల్లో ఇలాంటి పరిమితమైన మార్పులతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు లాభం కలగడం అనుమానమే.
అన్నిటికీ మించి టార్గెట్ అంత తక్కువగా పెట్టుకోవడం.. వచ్చే ఎన్నికల్లో విజయంపై ఆత్మవిశ్వాసం కాంగ్రస్‌లో కనిపించకపోవడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు - శ్రేణుల్లోనూ నీరసం వచ్చేసింది.