Begin typing your search above and press return to search.

రాహుల్ రాక కలిసి వస్తుందా...?

By:  Tupaki Desk   |   13 Aug 2018 4:40 AM GMT
రాహుల్ రాక కలిసి వస్తుందా...?
X
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంథీ తెలంగాణ పర్యటన కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అవకాశాలున్నాయా.. తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఇక్కడి కాంగ్రెస్ నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితిని గద్దె దించేందుకు సర్వ శక్తులు పణంగా పెడుతున్నారు. ఇందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంథీని తెలంగాణకు రప్పించి పలు చోట్ల సభలు - సమావేశాలు నిర్వహించనున్నారు. ఎన్నికలకు ఎంతో కాలం లేనందున, నెలకు ఒకసారైనా రాహుల్‌ ను రప్పించి ప్రచారం చేయలన్నది తెలంగాణ కాంగ్రెస్ పెద్దల ఆలోచన. తమను నమ్మించి మోసం చేసినా తెలంగాణ ముఖ‌్యమంత్రి కె. చంద్రశేఖర రావు పరాజయమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా రాహుల్ గాంధీ సోమవారం నాడు హైదారబాద్ వస్తున్నారు. ఈ పర్యటనలో యువత - విద్యార్దులు పార్టీవైపు ఆకర్షితులయ్యాలా ప్రణాళికలు రూపొందించారు. ఇందోలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రాహుల్ గాంధీ సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ సభ ద్వారా కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహంతోను విద్యార్దులను ఆకట్టుకోవాలన్నది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహం.

తామొకటి తలిస్తే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు మరొకటి తలచినట్టుగా అయింది. ఉస్మానియాలో రాహుల్ గాంధీ బహిరంగా సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో విద్యార్దులను - యువతను ఆకట్టుకోవాలన్న కాంగ్రెస్ వ్యూహన్ని దెబ్బకొట్టినట్లైయింది. తనను ఉస్మానియాలోకి విద్యార్దులు రానివ్వడం లేదనే అక్కసుతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు రాహుల్ సభకు అనుమతివ్వలేదని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ విధంగా చూసినా రాహుల్ సభ అనుమతి నిరాకరణ కూడా కాంగ్రెస్‌ కు అనుకూలించే అంశమే. తెలంగాణలో చంద్రశేఖర రావు పాలన ఎంత నియంత్రుత్వంగా ఉందో చూపడానికి కాంగ్రెస్‌కు ఉస్మానియా సంఘటన ఓ ఆయుధం. రాహుల్ గాంధీ తన తాజా పర్యటనలో ఇదే విషయాన్ని ప్రజలముందుంచే అవకాశమూ ఉంది. గడచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో రాహుల్ గాంధీ తన ఈ పర్యటనల ద్వారా తెలియజేసే అవకాశం ఉంది.

తొలివిడతగా హైదారబాద్ - రంగారెడ్డి జిల్లాలలో రాహుల్ జరుపుతున్న పర్యటన తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు కలిసోచ్చేలా ఉంది. రాహుల్ గాంధీ సోమ - మంగళవారాలు హైదారబాద్‌ లో ఉంటారు. బస్సుయాత్రలో పాల్గొంటారు. మహిళా సంఘాలతో భేటీ అవుతారు. హైదారబాద్ శివారులోని శేరిలింగంపల్లిలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు . ముఖ్యంగా తెలంగాణలో సెట్టిల్ అయినా ఆంధ్రుల మద్దతు కోసం రాహుల్ పర్యటనను ఉపయోగించుకుంటారు.