Begin typing your search above and press return to search.
రాహుల్ ప్లాన్ బీ కాంగ్రెస్ వాడేసుకుంటోంది
By: Tupaki Desk | 17 Sep 2018 11:43 AM GMTకాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల దూకుడును పెంచుతోంది. హిందూ వ్యతిరేక - మైనారిటీలను బుజ్జగించే పార్టీ అనే ముద్ర నుంచి కాంగ్రెస్ ను గట్టెక్కించడానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రథసారథి చెమటోడుస్తున్నారు. ఇందులో భాగంగా కొద్దికాలం క్రితం తెరమీదకు తీసుకువచ్చిన ప్రణాళికను ఆయన మరింత వేగంగా పెంచారు. హిందూ వ్యతిరేకతను తొలగించుకోవడం భాగంగానే పలు హిందూ దేవాలయాలను సందర్శించి రాహుల్ పూజలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇలాక అయిన గుజరాత్ నుంచి మొదలైన ఈ ట్రెండ్ అనంతరం కర్ణాటక ఎన్నికల్లో కూడా అమల్లో పెట్టారు. తాజాగా ఇప్పుడు హిందువులు పవిత్రంగా భావించే మానస సరోవర్ విషయంలోనూ అమల్లో పెట్టగా దానిలో కాంగ్రెస్ ఓ రేంజ్ లో వాడుకుంటోంది.
ఇటీవలే రాహుల్ గాంధీ మానససరోవర్ యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. తాను శివ భక్తుడిగా ప్రకటించుకున్న రాహుల్.. శివ భక్తులు ఎంతో పవిత్రంగా భావించే ఈ యాత్ర చేపట్టనుండటం ఆసక్తి రేపింది. అయితే మధ్యప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రచారానికి వాడుకుంటోంది. నేడు దసరా గ్రౌండ్‌లో జరిగే పార్టీ కార్యకర్తల భేటీని ఈ యాత్రతో ముడిపెట్టింది. రోడ్ షో జరిగే ప్రాంతాల్లో రాహుల్ శివలింగంపై నీటిని పోస్తున్న భారీ కటౌట్ లను పార్టీ నేతలు ఏర్పాటు చేశారు. ఇలా18 కిమీ మేర రాహుల్ రోడ్ షో అంతటా కటౌట్లను కట్టేశారు. రాహుల్ తనంత తానుగా శివభక్తుడిని అని ప్రకటించగా కాంగ్రెస్ నేతలు దాన్ని ఓ రేంజ్ లో వాడుకుంటున్నారని ఈ ప్రచారం చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు.