Begin typing your search above and press return to search.

అమ్మ టీం ఇంటికి.. కొడుకుదే రాజ్యం!

By:  Tupaki Desk   |   16 Sep 2017 10:01 AM GMT
అమ్మ టీం ఇంటికి.. కొడుకుదే రాజ్యం!
X
కాంగ్రెస్ యువ‌రాజుగా సుప‌రిచితుడైన రాహుల్ గాంధీ వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిగా మారాయి. దేశం కాని దేశానికి వెళ్లి తాను ప్ర‌ధాని రేసులో ఉండ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. ఇన్నేళ్లుగా రాజ‌కీయాల్లో ఉన్నా ఎప్పుడూ తాను ఏదైనా ప‌ద‌వికి పోటీ ప‌డ‌నున్న‌ట్లుగా ఆయ‌న చెప్పింది లేదు. పార్టీ నిర్ణ‌య‌మే శిరోధార్యం అన్న‌ట్లుగా మాట్లాడారే కానీ..ఇంత బాహాటంగా ఆయ‌న త‌న మ‌న‌సులోని మాట చెప్పింది లేదు.

ఉన్న‌ట్లుండి రాహుల్‌కు ప్ర‌ధాని ప‌ద‌వి రేసులో ఉండాల‌ని ఎందుకు అనిపించింది? విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఈ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య ఎందుకు చేసిన‌ట్లు? అన్న ప్ర‌శ్న‌లు వేసుకుంటే స‌మాధానాలు ఆస‌క్తిక‌రంగా మార‌తాయి. జాతీయంగా రాహుల్‌ కు ఎలాంటి ఇమేజ్ ఉంద‌న్న విష‌యం ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇంట గెలిచి ర‌చ్చ గెలిచే ప‌నికి శ్రీకారం చుట్టారు.

తొలుత పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టటం రాహుల్ టీం మొద‌టి ప‌ని. అయితే.. అందుకు పార్టీలో వ్య‌తిరేకించే వారు లేకున్నా.. త‌ప్పు ప‌ట్టే వారు.. విమ‌ర్శ‌లు చేసే వారు లేక‌పోలేదు. అలాంటి గొంతులు బ‌య‌ట‌కు రాకుండా ఉండేలా ప్లాన్ చేశారు.

ఇందులో భాగంగానే అమ్మ‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడైన డిగ్గీ రాజాకు తోక క‌త్తెరించ‌టం.. అమ్మ‌కు రాజ‌కీయ స‌ల‌హాదారు అయినా అహ్మ‌ద్ ప‌టేల్‌ను రాజ్య‌స‌భ‌కు పంప‌టంతో పాటు.. పార్టీలో ఆయ‌న పాదముద్ర‌లున్న ప‌లు ప్రాంతాల్లో తుడిచివేయ‌టం మొద‌లు పెట్టారు. అదే స‌మ‌యంలో త‌న‌కు స‌న్నిహితులైన ప‌లువురికి పార్టీలో కీల‌క బాధ్య‌త‌ల్ని అప్ప‌గించే ప‌నిని షురూ చేశారు.

గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్‌ ఆరుగురు ప్రధాన కార్యదర్శులను నియమించింది. హరీశ్‌ పవార్‌ - ఇంద్రాణి మిత్ర - కేశవ్‌ చంద్‌ యాదవ్‌ - మనీశ్‌ ఠాకూర్‌ - షాదీ పరంబిల్‌ శ్రీనివాస్‌ బీవీలంతా రాహుల్ అనుకూల వ‌ర్గం కావ‌టం గ‌మ‌నార్హం. తాను చెప్పిన‌ట్లుగా ప‌ని చేయ‌టానికి సిద్ధంగా లేని కాంగ్రెస్ వృద్ధ‌నేత‌ల తోక‌ల్ని క‌త్తిరించే ప‌నిని చేసిన రాహుల్‌.. ఇక త‌న‌ను తాను ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు వీలుగా పావులు క‌దిపారు. బిహార్‌ - కర్ణాటక - తెలంగాణ - రాజస్థాన్‌ - పంజాబ్‌ - ఉత్తరాఖండ్‌ - ఝార్ఖండ్‌ - చత్తీస్‌ గఢ్‌ - మధ్యప్రదేశ్‌ పార్టీ ఇన్‌ ఛార్జి నియామకాలన్నీ రాహుల్‌ కు అనుకూల నిర్ణయాలేనన్న మాట వినిపిస్తోంది. ఇక్క‌డ మోడీ త‌ర‌హాలోనే రాహుల్ వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

పార్టీపై ప‌ట్టు సాధించే ప‌నిని వ్యూహాత్మ‌కంగా పూర్తి చేసిన త‌ర్వాతే మోడీ త‌న‌కు తాను ప్ర‌ధాని అభ్య‌ర్థిన‌న్న విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. అదే రీతిలో రాహుల్ కూడా వ్య‌వ‌హ‌రించార‌ని చెప్పాలి.

ఇంటా.. బ‌య‌టా త‌న‌కు తిరుగులేని రీతిలో వాతావ‌ర‌ణాన్ని సెట్ చేసుకోవ‌టంలో మోడీ స‌క్సెస్ అయ్యారు. అలాంటి వేళ‌.. ఆయ‌న‌కు ధీటైన ఇమేజ్‌ను సొంతం చేసుకోవ‌టం అంత తేలికైన విష‌యం కాదు. కానీ.. అనివార్య‌మైన వేళ‌.. త‌నకు తాను స‌రికొత్త ఇమేజ్ ను తెచ్చుకునే ప్ర‌య‌త్నాన్ని రాహుల్ షురూ చేశార‌ని చెప్పాలి.

నిజానికి అనుకోకుండా రాహుల్ నోటి నుంచి ప్ర‌ధాని పోస్ట్ కు తాను పోటీలో ఉన్నాన‌న్న మాట చెప్ప‌లేద‌ని చెప్పాలి. ఆయ‌న నోటి నుంచి ఆ మాట రావ‌టానికి వెనుక చాలానే క‌స‌ర‌త్తు జ‌రిగింది. కాంగ్రెస్ అధ్య‌క్ష బాధ్య‌త‌ల్ని చేప‌ట్టే ముందు.. అంత‌ర్జాతీయంగా మెప్పించేందుకే అమెరికా ప‌ర్య‌ట‌న‌గా చెబుతున్నారు. ఆయన తాజా టూర్ ప్లాన్‌ ను శ్యామ్ పిట్రోడో డిజైన్ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఎంత‌లా అంటే.. ఆయ‌న ఏం డ్రెస్ వేసుకోవాల‌న్న ద‌గ్గ‌ర నుంచి ప్ర‌తిదీ ప్లాన్ ప్ర‌కార‌మే సాగుతుంద‌న్న మాట వినిపిస్తోంది. మ‌రింత చేసిన త‌ర్వాత.. ముందే అనుకున్న‌ట్లు తాను ప్ర‌ధాని ప‌ద‌వి రేసులో ఉన్నాన‌ని రాహుల్ చెప్పారు. టోట‌ల్ గా చూస్తే.. రానున్న‌కొద్ది నెల‌ల్లో కాంగ్రెస్ పీఠాన్ని రాహుల్ అధిష్ఠించ‌టంతో పాటు.. అమ్మ బృందాన్ని ఇంటికి పంపించ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.