Begin typing your search above and press return to search.
రాహుల్ కు చుక్కలు చూపిస్తున్నారు..
By: Tupaki Desk | 6 April 2019 12:56 PM GMTకాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన సొంత నియోజకవర్గం ‘అమేథి’తోపాటు దక్షిణాదిన కేరళలోని వేనాడ్ నుంచి కూడా ఎంపీగా పోటీచేస్తున్నారు. ఇప్పుడు అక్కడ రాహుల్ కు చుక్కలు చూపిస్తున్నారు. కేరళ రాష్ట్రంలోని వేనాడ్ నుంచి పోటీచేస్తున్న రాహుల్ గాంధీకి చిక్కులు తెచ్చేందుకు అదే పేరున్న ‘అగిల ఇండియా మక్కల్ కజగమ్ పార్టీ’ తరుఫున నుంచి రాహుల్ గాంధీ కేఈ అనే పేరున్న వ్యక్తిని వెతికి మరీ రాహుల్ పై పోటీకి నిలుపుతుండడం కాంగ్రెస్ ను కలవరపెడుతోంది.
రాహుల్ గాంధీ పేరు చివర కేవలం కేఈ అనే పేరు వ్యక్తిని పోటీకి నిలుపుతున్నారు. దీంతో రాహుల్ గాంధీపై రాహుల్ గాంధీయే పోటీచేస్తున్నట్టు లెక్క. అంతేకాదు.. ఈ కేరళ వాసి రాహుల్ గాంధీ కేఈ సోదరుడి పేరు కూడా రాజీవ్ గాంధీ కేఈ. ఇక ఈయన కూతురు పేరు ఇందిరా ప్రియాదర్శిని. కాంగ్రెస్ పై అభిమానంతోనే ఈయన ఈ పేర్లను పెట్టుకున్నారట.. కానీ కాంగ్రెస్ రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు రాహుల్ పైనే ఈయనను పోటీకి దింపడం విశేషంగా మారింది.
రాజీవ్ గాంధీ స్వయానా రాహుల్ తండ్రి. ఇక ఇందిరా నానమ్మ. ఇలా ఇద్దరి బయోడేటాల్లో ఒకటే పేర్లు ఉండడం.. ఓటింగ్ వేసేటప్పుడు ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశాలుంటాయి. దీనివల్ల కాంగ్రెస్ కు పడే ఓట్లు డమ్మీ రాహుల్ కు పడే ప్రమాదం ఉందని కాంగ్రెస్ ఆందోళన చెందుతోందట.. ఏం జరుగుతుందో చూడాలి మరి..