Begin typing your search above and press return to search.
రాహుల్ ఇఫ్తార్ కు డేట్ ఫిక్స్!
By: Tupaki Desk | 10 Jun 2018 4:24 AM GMTకాంగ్రెస్ తన వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో తన కార్యకలాపాల్లో వేగం తగ్గించిన కాంగ్రెస్ తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మరింత దూకుడ్ని పెంచింది. రెండేళ్లుగా ఇఫ్తార్ విందును నిర్వహించని కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు ఇఫ్తార్ విందును ఇవ్వాలని డిసైడ్ చేసింది.
ఇందులో భాగంగా ఈ నెల 13న ఢిల్లీలో భారీ ఎత్తున ఇఫ్తార్ విందును ఇవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ చేసింది. ఈ విందుకు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు హాజరవుతారని చెబుతున్నారు. ఢిల్లీలోని తాజ్ ఫ్యాలస్ హోటల్లో ఇచ్చే ఇఫ్తార్ విందుతో రాహుల్ తన లక్ష్యమైన మోడీ వ్యతిరేక శక్తుల్ని పునరేకీకరణ చేసే ప్రయత్నంలో ఉంది. ఇందులో భాగంగా తన వ్యూహరచనకు మరింత పదును పెడుతున్న ఆ పార్టీ .. మైనార్టీలను ఆకర్షించటంతో పాటు.. భావ సారుప్య పార్టీల దృష్టిని ఆకర్షించాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
మరోవైపు రాహుల్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయ్యాక నిర్వహిస్తున్న మొదటి ఇఫ్తార్ విందును మరింత ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ విందు రాజకీయంతో మోడీని మరింత డ్యామేజ్ కలిగేలా వ్యూహరచనకు పదును పెట్టారని.. అందుకే రెండేళ్ల క్రితం ఆపిన ఇఫ్తార్ విందును ఈసారి మరింత ఘనంగా నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కాంగ్రెస్ వ్యూహరచన ఎంత మేరకు వర్క్ వుట్ అవుతుందన్నది తాజా విందుతో తేలనుందని చెప్పక తప్పదు.