Begin typing your search above and press return to search.
యువ సీఎం? వృద్ధ నేత.. రాహుల్ ఏం చేస్తారు?
By: Tupaki Desk | 13 Dec 2018 5:04 AM GMTహిందీ బెల్ట్ లోని రాజస్తాన్ - మధ్యప్రదేశ్ - చత్తీస్ ఘడ్ లో గెలవగానే రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలు తమకు ఊపిరి పోశారని.. తన జీవితంలోనే ఈ ఎన్నికలు అత్యంత క్లిష్టమైనవని వ్యాఖ్యానించారు. ఈ మూడు రాష్ట్రాల గెలుపుతో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవమైందన్నారు.
అయితే బీజేపీ మధ్యప్రదేశ్ ను చేజిక్కించుకునేందుకు చాలా ప్లాన్లు చేసింది. కర్ణాటక తరహాలో బీజేపీకి అధికారం దక్కేలా కుట్ర పన్నిందనే ఆరోపణలున్నాయి.కానీ ప్రస్తుత మధ్యప్రదేశ్ సీఎం మాత్రం ప్రజా తీర్పును శిరసావహిస్తానని.. ఓటమిని అంగీకరించి రాజీనామా చేసి కాంగ్రెస్ కు లైన్ క్లియర్ చేశారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ ఇలా అలిసిసొలసి వైదొలగడం.. రాజీనామా చేశాక.. ప్రశాంతంగా ఉందని ట్వీట్ చేయడం విశేషం.
ఇక మూడు రాష్ట్రాల్లో విజయం పరిపూర్ణం కావడంతో ఇప్పుడు ఆ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్ మొదలుపెట్టారు. కిస్సా కుర్చీకా అంటూ సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ కరుణ కోసం వేచిచూస్తున్నారు. రాహుల్ ఈసారి యువ సీఎంల వైపు చూస్తారా.? లేక తలపండిన వృద్ధ నేతలను ఎంచుకుంటారా అన్నది ఆసక్తికరంగా మారింది. రాజస్తాన్ లో యువ సచిన్ పైలెట్ - సీనియర్ అశోక్ గెహ్లాట్ సీఎం పదవి రేసులో ఉన్నారు. ఇక మధ్యప్రదేశ్ లో సీనియర్ కమలనాథ్ - జూనియర్ జ్యోతిరాధిత్య సింధియా రేసులో ఉన్నారు.
వీరిలో యువకులైన సింధియా - పైలెట్ లు రాహుల్ గాంధీకి సన్నిహితులుగా ముద్రపడ్డారు. సీనియర్లు గెహ్లాట్ - కమల్ నాథ్ లు సోనియాగాంధీకి చిరపరిచితులు. దీంతో విధేయత - యువతల మధ్య రాహుల్ ఎవరిని ఎంచుకుంటారన్నది సస్పెన్స్ గా మారింది. ఇక చత్తీస్ ఘడ్ లో కూడా ఇద్దరు ప్రముఖ నేతలు పోటీపడుతున్నారు. మరి రాహుల్ తీసుకోబోయే నిర్ణయంపైనే అందరి ఆసక్తి నెలకొంది.