Begin typing your search above and press return to search.
సుదీర్ఘ యాత్రకు రాహుల్ గాంధీ రెడీ?
By: Tupaki Desk | 25 Oct 2019 5:30 PM GMTహర్యానా - మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనప్పటికీ.. ఫలితాలతో ఆ పార్టీకి కొంత ఉత్సాహం వచ్చిన సంగతి స్పష్టం అవుతూ ఉంది. లోక్ సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ చాలా వరకూ నిరుత్సాహంలో కూరుకుపోయింది. ఇక కోలుకోవడం సాధ్యమేనా? అనే సందేహంలో పడిపోయింది పార్టీ.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ కాడి కూడా పడేశాడు. అసలు మహారాష్ట్ర - హర్యానాల ప్రచారానికి కూడా కాంగ్రెస్ ముఖ్య నేతలు వెళ్లలేదు. అక్కడి స్థానిక నేతలే ఏదోలా నెట్టుకొచ్చారు. ఈ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన నిస్పృహలో ఉండేది. అయితే అప్పుడు ఆ స్థానంలో కొత్త ఉత్సాహం వస్తోంది.
ఈ పరిణామాల్లో రాహుల్ గాంధీలో కూడా ఆ ఉత్సాహం వస్తోందట. తనను తాను నిరూపించుకోవడానికి ఆయన రెడీ అవుతున్నాడని సమాచారం. గత కొన్నాళ్లుగా రాహుల్ రాజకీయంగా నిర్లిప్తంగా ఉన్నాడు. దానికంతా బ్రేక్ ఇస్తూ రాహుల్ ఇప్పుడు ఒక సుదీర్ఘ యాత్రకు రెడీ అవుతూ ఉన్నాడట.
ఈ యాత్ర ఎంత సుదీర్ఘంగా ఉండబోతోంది అంటే.. అటు కశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకూ రాహుల్ పర్యటన సాగబోతూ ఉందని సమాచారం. మోడీ ప్రభుత్వంపై వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి - కాంగ్రెస్ పార్టీకి పునరుత్తేజం కలిగించడానికి - తనను తాను నిరూపించుకోవడానికి రాహుల్ గాంధీ ఈ యాత్రను చేపట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.
రాహుల్ ఈయాత్రను బస్ ద్వారా చేపడతాడా - లేక ఏదైనా రథ యాత్ర అంటాడా ..ఇవన్నీ కాకుండా.. ఏకంగా నడక యాత్రే మొదలుపెట్టి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తాడా? అనేది ఆసక్తిదాయకంగా మారింది. ఒకవేళ నడకా యాత్రే అయితే.. రాహుల్ ఇప్పుడు మొదలుపెడితే వచ్చే ఎన్నికల నాటికి అది పూర్తి కాగలదు. అలా చేస్తే రాహుల్ కు పొలిటికల్ గా బ్రహ్మాండమైన మైలేజ్ వస్తుంది కూడా. విరామం లేకుండా ఇప్పటి నుంచి కష్టపడటం మొదలుపెడితే.. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ కు రాహుల్ పునరుత్తేజం కలిగించగలడం ఖాయమే! ఈ యాత్ర బస్సుయాత్రగానే ఉంటుందని మాత్రం సమాచారం అందుతూ ఉంది.