Begin typing your search above and press return to search.

సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ .. ఎందుకంటే ?

By:  Tupaki Desk   |   24 Jun 2021 7:30 AM GMT
సూరత్ కోర్టుకు రాహుల్ గాంధీ  .. ఎందుకంటే ?
X
కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు పరువు నష్టం కేసు విచారణ లో భాగంగా సూరత్ కోర్టులో విచారణకి హాజరైయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్‌ గుజరాత్‌ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా వివరాలు వెల్లడించారు. రాహుల్ గాంధీ కేవలం ఆ కేసు విషయంలో కోర్టుకు మాత్రమే హాజరయ్యేందుకే రాహుల్ గాంధీ సూరత్ వస్తున్నారని ఆయన తెలిపారు. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ రాహుల్ పాల్గొనబోరని ఆయన స్పష్టచేశారు. కేసు విచారణ ముగిసిన తర్వాత మళ్లీ తిరుగు ప్రయాణం అవుతారన్నారు. ఆయన పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని వెల్లడించారు.

ఇంతకీ రాహుల్ గాంధీ పై ఎవరు, ఎందుకు పరువు నష్టం కేసు విధించారు అనే వివరాల్లోకి వెళ్తే .. 2019, ఏప్రిల్‌ 13న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌ లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఆ సమయంలో మోదీ ఇంటి పేరును ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దొంగలందరీకి మోదీ ఇంటి పేరే ఎందుకు ఉంటుందంటూ ఆయన విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత, సూరత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ తన మాటలతో మోదీ ఇంటి పేరున్న వారందరి ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ కోర్టులో పరువునష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ నిమిత్తం రాహుల్ గాంధీ 2019, అక్టోబరులోనూ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఆ సమయంలో తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆ సమయంలో రాహుల్ గాంధీ కోర్టుకు వెల్లడించారు.