Begin typing your search above and press return to search.
రాహుల్ .. మళ్లీ అమేథీకి!
By: Tupaki Desk | 8 July 2019 5:30 PM GMTఈ నెల పదో తేదీ నుంచి అమేథీలో పర్యటించబోతున్నారట రాహుల్ గాంధీ! ఇటీవలి లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో అమేథీ ప్రజలు రాహుల్ పరువు తీసిన సంగతి తెలిసిందే. దేశానికి ప్రధాని అయిపోవాలని కలలు కన్న రాహుల్ గాంధీకి అమేథీ ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు.
ఆయనను ఎంపీగా ఓడించారు. వరసగా మూడు దఫాలు రాహుల్ ను అమేథీ ప్రజలు ఎంపీగా గెలిపించారు. అయితే ఈ సారి మాత్రం ఓడించారు. స్మృతీ ఇరానీని గెలిపించారు ఆ నియోజకవర్గం ప్రజలు - అమేథీ ప్రజలు ఝలక్ ఇచ్చినా - వయనాడ్ లో భారీ మెజారిటీతో నెగ్గడం ద్వారా రాహుల్ గాంధీ పరువు నిలుపుకున్నారు. వయనాడ్ లో భారీ మెజారిటీతోనే నెగ్గారు రాహుల్. దీంతో కనీసం ఎంపీగా అయినా కొనసాగుతూ ఉన్నారు.
అయితే అమేథీ ప్రజలు తనకు అంతటి ఝలక్ ఇచ్చినా, ఆ ప్రాంత ప్రజలపై రాహుల్ కు అభిమానం కొనసాగుతూ ఉందట. అందుకే అక్కడ పర్యటించబోతున్నారట రాహుల్ గాంధీ. అందుకు కాంగ్రెస్ అన్ని ఏర్పాట్లు చేసిందట. ఈ నెల పదో తేదీ నుంచి రాహుల్ అమేథీ నియోజకవర్గంలో పర్యటించబోతున్నారని, తనను ఓడించినా అక్కడి ప్రజలపై తన ఆదరాభిమానాలు కొనసాగుతున్నట్టుగా రాహుల్ నిరూపించుకుంటున్నారని కాంగ్రెస్ చెబుతోంది.
మొత్తానికి రాహుల్ రాజకీయం లో వెనుకబడ్డారు అనుకుంటే.. ఇలాంటి చర్యల ద్వారా మాత్రం అప్పుడప్పుడు బాగానే రాజకీయాన్ని చేస్తూ ఉంటాడు కాబోలు!