Begin typing your search above and press return to search.
‘అమ్మ’ చెంతకు అబ్బాయి
By: Tupaki Desk | 7 Oct 2016 7:40 AM GMTదేశ సమకాలీన రాజకీయాల్లో అమ్మ అంటే జయలలితే.. ఇక అబ్బాయి అంటే రాష్ట్రాల్లో చాలామంది అబ్బాయిలు ఉన్నప్పటికీ జాతీయ స్థాయిలో చూసుకుంటే మాత్రం అబ్బాయి అన్న పదం రాహుల్ గాంధీకే వర్తిస్తుంది. సోనియాగాంధీ కుమారుడిగా - కాంగ్రెస్ భవిష్యత్ అధ్యక్షుడిగా అబ్బాయికి ఆ పార్టీలో తిరుగులేని ప్రాధాన్యం ఉంది. ఇప్పుడు ఆ అబ్బాయి తమిళ ‘అమ్మ’ జయలలితను చూసేందుకు రెక్కలు కట్టుకుని చెన్నైలో వాలుతున్నారు. పదిహేను రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ... ఏం జరిగిందో తెలియకుండా ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్న అమ్మ ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు, పరామర్శించేందుకు కాంగ్రెస్ యువనేత చెన్నై వస్తున్నారు.
ప్రత్యేక విమానంలో చెన్నైకి వస్తున్న ఆయన సరాసరి అపోలో ఆసుపత్రికి వెళ్లి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను పరామర్శించనున్నారు. రెండు వారాలకు పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె - కోలుకుంటున్నారని వైద్యులు చెబుతున్నప్పటికీ - ఆమెకు ఏమైందన్న విషయంలో సరైన సమాచారం ఇంతవరకూ బయటకు రాని సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా రాజకీయ నేతల్లో కొంత ఆందోళన ఉంది. దేశంలో సీనియర్ ముఖ్యమంత్రుల్లో ఒకరైన ఆమె గతంలో సంకీర్ణ ప్రభుత్వాల్లో ఉండడంతో జాతీయ స్థాయి పార్టీలు - నేతలతో మంచి సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలో జయ ఆరోగ్యంపై జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ ఆమెను పరామర్శించేందుకు వస్తున్నారు.
అయితే.. మేనకోడలు - దత్త పుత్రుడికి కూడా జయలలితను చూసేందుకు అనుమతి లభించని నేపథ్యంలో రాహుల్ ను అనుమతిస్తారో లేదో చూడాలి. ప్రస్తుతం జయలలిత స్వయంగా శ్వాస పీల్చుకునే పరిస్థితిలో లేరని తెలుస్తోంది. ఆమెను వెంటిలేటర్ పై ఉంచి కృత్రిమ శ్వాస అందిస్తూ చికిత్స చేస్తున్నారని చెబుతున్నారు. కాగా రాహుల్ వచ్చి పరామర్శించి వెళ్లాక దేశంలోని మిగతా నేతలూ జయను పరామర్శించేందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/