Begin typing your search above and press return to search.
కార్యకర్తలు చనిపోతే బాథ్యత తీసుకున్నావా రాహుల్
By: Tupaki Desk | 20 Jan 2016 5:29 AM GMTసెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాద్ కు రావటం.. రోహిత్ కుటుంబ సభ్యుల్ని.. విద్యార్థుల్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాహుల్ ఒక వ్యాఖ్య చేశారు. యూనివర్సిటీకి చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే.. వారికి సంబంధించిన వారిని పరామర్శించాల్సిన బాధ్యత వర్సటీ వీసీ మీద లేదా? అంటూ రాహుల్ ప్రశ్నించారు.
రాహుల్ మాటను విన్నవారంతా నిజమే కదా అని అనుకుంటారు. కానీ.. రాహుల్ మాటనే ఒక ప్రశ్నగా రాహుల్ కు సంధిస్తే ఆయన మాటల్లో మాయ ఇట్టే అర్థమవుతుంది. ఎందుకంటే.. కాంగ్రెస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు చాలానే కారణాలతో మరణిస్తున్నారు. వారిలో ఒక్కరినైనా రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా వెళ్లి పరామర్శించారా? అంతదాకా ఎందుకు..? ఏపీలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటానికి.. కేంద్రంలో యూపీఏ సర్కారు కొలువు తీరటంలో వైఎస్ కృషిని అంత తక్కువ చేసి చూడలేం. మరి.. అలాంటి వైఎస్ ప్రమాదవశాత్తు మరణించారు.
ఆయన ఆకస్మిక మృతిని తట్టుకోలేక పెద్దఎత్తున కార్యకర్తలు మరణించారు. వారిని ఓదార్చేందుకు వైఎస్ కుమారుడు జగన్ ఓదార్పు యాత్రను మొదలు పెడితే.. దాన్ని అడ్డుకోవటమే కాదు.. ఆయనపై చర్యలు తీసుకోవటానికి వెనుకాడలేదు. ఒకవేళ ఓదార్పు యాత్ర పేరుతో జగన్ రాజకీయం చేస్తున్నారని భావిస్తే.. అలాంటి అవకాశం ఇవ్వకుండా.. వైఎస్ మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన వారందరిని ఒకచోటకు చేర్చి.. సోనియా.. రాహుల్ లాంటి వారు ఓదార్చి.. వారి కుటుంబాలకు అండగా ఎందుకు నిలవలేదు? వర్సిటీ విద్యార్థి విషయంలో వీసీ ఎలా వ్యవహరించాలో పాఠాలు చెబుతున్న రాహుల్.. పార్టీ కార్యకర్తల విషయంలో అధినేతలు ఏం చేయాలన్న విషయాన్ని రాహుల్ అండ్ కో ఎందుకు మర్చిపోయినట్లు..? ఈ ప్రశ్నకు సమాదానం చెప్పే వారెవరు?