Begin typing your search above and press return to search.

కేంద్ర మంత్రి సుష్మాను పరామర్శించిన రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   29 April 2016 9:13 AM GMT
కేంద్ర మంత్రి సుష్మాను పరామర్శించిన రాహుల్ గాంధీ
X
ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ను కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు పరామర్శించారు. జ్వరం - ఛాతి నొప్పితో ఈ నెల 25న ఎయిమ్స్ లో చేరిన సుష్మా స్వరాజ్ కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత ఐదు రోజులుగా ఆసుపత్రిలో ఉన్న సుష్మా స్వరాజ్ ను ఈ రోజు రాహుల్ గాంధీ పరామర్శించి వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

నాలుగు రోజుల క్రితం ఛాతీలో నొప్పి రావడంతో సుష్మ ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సుష్మా ఆరోగ్యం కాస్తంత మెరుగుపడినా, పూర్తిగా నయం కాలేదని వైద్యులు చెప్పారు. మంత్రి ఆరోగ్యం మరింత మెరుగుపడిన తర్వాత ఆమెను డిశ్చార్జీ చేస్తామని వారు తెలిపారు. ఇదిలా ఉంటే, అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ... కొద్దిసేపటి క్రితం ఎయిమ్స్ కు వెళ్లి సుష్మాను పరామర్శించారు. సుష్మా ఆరోగ్యంపై అక్కడి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

మోడీపై, బీజేపీపై మాట్లాడితే చాలు విరుచుకుపడే రాహుల్ గాంధీ ఇలా మోడీ జట్టులోని కీలక మంత్రిని పరామర్శించడానికి వెళ్లడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. అయితే, సుష్మకు అన్ని పార్టీల నేతలతో ఉన్న సత్సంబంధాలు.. కాంగ్రెస్ నేతలతో, సోనియా కుటుంబంతోనూ తీవ్ర విభేధాలేమీ లేకపోవడం వంటివి రాహుల్ పరామర్శకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు ప్రత్యర్థి పార్టీ నేతలనూ పరామర్శించే గొప్ప సంస్కారం ఉందని నిరూపించుకునే ఉద్దేశంతోనూ రాహుల్ ఈ స్టెప్ వేసినట్లు భావిస్తున్నారు.