Begin typing your search above and press return to search.
తండ్రి తప్పును సరిచేస్తున్నరాహుల్!
By: Tupaki Desk | 23 Aug 2017 8:47 AM GMTతప్పుల మీద తప్పులు చేయటంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు..కాంగ్రెస్ యువరాజుగా పేరున్న రాహుల్ గాంధీకి అలవాటుగా పలువురు విమర్శిస్తుంటారు. ఆయన నేతృత్వంలో కాంగ్రెస్ మరింత క్షీణిస్తుందన్న విశ్లేషణను పలువురు చేస్తుంటారు. దీనికి తగ్గట్లే ఆయన బాధ్యతలు స్వీకరించిన ప్రతిచోటా పార్టీ ఫెయిల్ కావటం కనిపిస్తుంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ట్రిపుల్ తలాక్ విషయంలో తన తండ్రి చేసిన తప్పును రాహుల్ సరిచేస్తున్నట్లుగా చెబుతున్నారు.
ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వటం.. ఇది రాజ్యాంగ విరుద్ధమని చెబుతూ ఆర్నెల్లపాటు నిషేధాన్ని విధించి.. ఆకాలం పూర్తి అయ్యే లోపు చట్టాన్ని చేయాలన్న సూచనను చేయటం తెలిసిందే. ఈ తీర్పుపై రాహుల్ స్పందించారు. తీర్పును స్వాగతిస్తున్నామని.. తలాక్ చెల్లుబాటు రద్దుతో ముస్లిం మహిళా హక్కులు నిలుస్తాయని.. న్యాయం కోసం పోరాడిన మహిళలకు అభినందనలు అంటూ రాహుల్ చేసిన ట్వీట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ముస్లిం మహిళల విషయంలో రాహుల్ తండ్రి.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చేసిన తప్పును రాజకీయ వారసుడిగా సరిచేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. ప్రధానిగా రాజీవ్ అధికారంలో ఉన్న సమయంలోముస్లిం మహిళలకు నష్టం వాటిల్లేలా నిర్ణయం తీసుకున్నారన్న గతాన్ని కొందరు గుర్తు చేసుకుంటున్నారు.
అదెలానంటే.. 32 ఏళ్ల కిందట తలాక్ బాధితురాలు షాబానో కేసులో ఆమెకు మద్దతుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాదంటూ.. రాజీవ్ గాంధీ సర్కారు తీసుకొచ్చి కొత్త చట్టాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. తన భర్త మహ్మద్ అహ్మద్ ఖాన్ తలాక్ అంటూ మూడుసార్లు చెప్పిన ఉదంతంలో ఆమె భరణం కోసం భర్త మీద క్రిమినల్‌కేసు పెట్టారు. ఇస్లాం ప్రకారం తాను ఇద్దత్ కాలానికి మాత్రమే భరణం ఇస్తానని షాబానో భర్త వాదించారు. ఈ కేసును విచారించిన సుప్రీంకోర్టు షాబానోకు అనుకూలంగా తీర్పును ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. అప్పటి ప్రధానిగా వ్యవహరిస్తున్న రాజీవ్ గాంధీ మాత్రం సుప్రీం తీర్పునకు భిన్నంగా నిర్ణయాన్ని తీసుకొని ముస్లిం మహిళల ఆగ్రహావేశాలకు గురయ్యారు. ఆయన హయాంలోని కాంగ్రెస్ సర్కారు ముస్లిం ప్రొటెక్షన్ అండ్ డైవర్స్ యాక్ట్ (1986)ను తీసుకొచ్చారు. ఈ చట్టం ప్రకారం ఇద్దత్ కాలానికి మాత్రమే భర్త భరణం ఇవ్వాల్సి ఉంటుంది. తమకు నష్టం చేకూరే ఈ ఉదంతంపై అప్పటి ముస్లిం మహిళల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే.. తన తండ్రి రాజీవ్ గాంధీ తీరుకు భిన్నంగా రాహుల్ గాంధీ తాజా తలాక్ ఎపిసోడ్ లో సానుకూలంగా స్పందించారని చెప్పాలి. తండ్రి చేసిన తప్పును కొంత మేర రాహుల్ తగ్గించారని చెప్పకతప్పదు.