Begin typing your search above and press return to search.
రాహుల్ రాజీనామాపై కాంగ్రెస్ స్పందించింది!
By: Tupaki Desk | 14 Jun 2019 1:30 AM GMTతను తప్పుకోవడం తప్ప తనకు మరో మార్గం లేదని, కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదవికి తను రాజీనామా చేసినట్టే అని, రాజీనామాను ఉపసంహరించుకునేది లేదని రాహుల్ గాంధీ హడావుడి చేసినా, ఆ పార్టీ మాత్రం అందుకు సమ్మతించలేదు. రాహుల్ గాంధీ రాజీనామా పత్రం ఇచ్చి ఇప్పటికే కొన్ని రోజులు గడిచాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాగానే రాహుల్ రాజీనామా అనేశాడు. పార్టీ ఓటమికి తనదే బాధ్యత అంటూ తప్పుకుంటున్నట్టుగా ప్రకటించాడు. అయితే కాంగ్రెస్ వాళ్లు మాత్రం ఆ రాజీనామాకు ఒప్పుకోలేదు.
రాహుల్ చేత రాజీనామా పత్రాన్ని వెనక్కు తీసుకునేలా చేస్తామంటూ ఆ పార్టీ నేతలు ప్రకటించారు. ఆ విషయంలో సోనియాగాంధీ కూడా జోక్యం చేసుకున్నారట. ప్రియాంక కూడా రాహుల్ ను వారించారని, రాజీనామా వద్దని చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆ పార్టీ మిత్రపక్షాల నేతలు కూడా ఈ విషయంలో రాహుల్ ను సముదాయించినట్టుగా తెలిసిందే. అయితే రాహుల్ ఈ విషయం పైవెనక్కు తగ్గలేదనీ వార్తలు వచ్చాయి.
కానీ చివరకు మాత్రం రాహుల్ వెనక్కు తగ్గినట్టేనట. రాహుల్ గాంధీనే జాతీయాధ్యక్షుడిగా కొనసాగుతారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ విషయంలో మరో మాట లేదని, రాహులే తమ పార్టీ జాతీయాధ్యక్షుడని కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించేసింది.