Begin typing your search above and press return to search.

రాహుల్.. ఈసారి ఎందుకు చెప్పాలనిపించింది?

By:  Tupaki Desk   |   14 Jun 2017 6:40 AM GMT
రాహుల్.. ఈసారి ఎందుకు చెప్పాలనిపించింది?
X
అత్యున్న‌త స్థానాల్లో ఉన్న వారు.. కీల‌క ప‌ద‌వుల్లో ఉండే వారికి సంబంధించిన స‌మాచారం ఎప్ప‌టిక‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌స్తూనే ఉంటుంది. ప్ర‌జాజీవితంలో ఉండే వారు తాము ఎక్క‌డికి వెళుతున్నామ‌న్న విష‌యాల్ని ఓపెన్ గా చెప్పేస్తుంటారు. ఇక‌.. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వెళ్లే విహార‌యాత్ర‌ల్ని సైతం కొంద‌రు నేత‌లు చెప్పేస్తుంటారు. మ‌రికొంద‌రు అలాంటి విష‌యాల్ని గుట్టుగా దాచేస్తుంటారు.

కానీ.. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మాత్రం కాస్త భిన్నం. ఆయ‌న త‌న ప్ర‌యాణాల గురించి అస్స‌లు పెద‌వి విప్ప‌రు. విదేశాల‌కు ఆయ‌న జ‌ర్నీల‌కు సంబంధించిన స‌మాచారాన్ని అస్స‌లు ఇవ్వ‌రు. ఆ మ‌ధ్య‌న కొన్ని వారాల పాటు ఎవ‌రికి చెప్ప‌కుండా ఎక్క‌డెక్క‌డో తిరిగి వ‌చ్చిన రాహుల్‌.. త‌ర్వాత కూడా తాను ఎక్క‌డికి వెళ్లింద‌న్న విష‌యాన్ని చెప్ప‌లేదు.

ఇక‌.. ప్ర‌తి ఏడాది త‌న పుట్టిన రోజుకు టంచ‌నుగా బ‌య‌ట‌కు వెళ్లే అల‌వాటున్న రాహుల్‌.. ఈసారీ విదేశాల‌కు వెళుతున్నారు. అయితే.. ఛేంజ్ ఏమిటంటే.. ఈసారి తాను ఎక్క‌డికి వెళుతున్నాన‌న్న విష‌యాన్ని రాహుల్ చెప్ప‌టం. తన అమ్మ‌మ్మ‌ను.. అమ్మ త‌ర‌ఫు వారిని చూసేందుకు.. వారితో కొన్ని రోజులు గ‌డిపేందుకు వీలుగా తాను ఇట‌లీ వెళుతున్న‌ట్లుగా ట్విట్ట‌ర్‌ లో రాహుల్ ట్వీట్ చేశారు. తాజా ట్రిప్‌ లోనే తన పుట్టిన‌రోజును కూడా జ‌రుపుకోనున్న‌ట్లు వెల్ల‌డించారు. ఎప్పుడూ లేని విధంగా.. త‌న ఫారిన్ టూర్ గురించి అంద‌రికి చెప్పుకోవాల‌న్న ఆలోచ‌న రాహుల్‌కు ఎందుకు వ‌చ్చిన‌ట్లు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/