Begin typing your search above and press return to search.

రాహుల్ గెలుపు లెక్క చెప్పిన అస‌ద్!

By:  Tupaki Desk   |   10 Jun 2019 8:24 AM GMT
రాహుల్ గెలుపు లెక్క చెప్పిన అస‌ద్!
X
కాంగ్రెస్ కు అందునా గాంధీ కుటుంబానికి కంచుకోట లాంటి అమేధీలో దారుణ ఓట‌మి రాహుల్ ను ఎంత‌గా బాధించిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. 2014 ఎన్నిక‌ల ఫ‌లితా స‌మ‌యంలో రెండు..మూడు రౌండ్లు అధిక్య‌త త‌గ్గిన‌ప్పుడే ఆయ‌న అపాయాన్ని అంచ‌నా వేయాల్సింది. ఒక‌వేళ ఆ విష‌యంలో ఆయ‌న అలెర్ట్ గా ఉండి ఉంటే.. క‌చ్ఛితంగా అమేధీలో ఆయ‌న ఓడిపోయి ఉండేవారు కాదు.

అమేధీని ఏ విధంగా అయినా సొంతం చేసుకోవాల‌ని ఫిక్స్ అయినా మోడీషాలు తాము అనుకున్న‌ది సాధించారు. అమేధీలో ప్ర‌జ‌లు రాహుల్ ను రిజెక్ట్ చేస్తే.. కేర‌ళ‌లోని వ‌య‌నాడు ఓట‌ర్లు మాత్రం ఆయ‌న‌కు భారీ మెజార్టీని క‌ట్ట‌బెట్టి అంతోఇంతో ఆనందాన్ని మిగిల్చారు. ఒక‌విధంగా చెప్పాలంటే అమేధీ వేద‌న‌ను.. వ‌య‌నాడ్ విజ‌యం రాహుల్ ను ఊర‌ట‌ను ఇచ్చింద‌ని చెప్పాలి. వ‌య‌నాడ్ లో ఆయ‌న 4.31ల‌క్ష‌ల ఓట్ల మెజార్టీతో విజ‌యం సాధించారు.

అయితే.. వ‌య‌నాడులో రాహుల్ గెలుపున‌కు కార‌ణాన్ని చెప్పుకొచ్చారు మ‌జ్లిస్ అధినేత అస‌దుద్దీన్ ఓవైసీ. వ‌య‌నాడ్ లో 40 శాతానికి పైగా ముస్లిం ఓట్ బ్యాంక్ ఉంద‌ని.. వారంద‌రి ఓట్లు రాహుల్ కే ప‌డిన‌ట్లుగా ఆయ‌న చెప్పారు. అందుకే భారీ మెజార్టీని సొంతం చేసుకోగ‌లిగిన‌ట్లుగా చెప్పారు.

దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీ పట్ల వ్య‌తిరేక‌త‌తో ఉన్న విష‌యం తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు స్ప‌ష్టం చేశాయ‌న్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా ముస్లింలు ఎక్కువ‌గా ఉండే రాష్ట్రాల్లో బీజేపీ గెల‌వ‌లేద‌ని ఆయ‌న చెప్పారు. ముస్లింలు ఎక్కువ‌గా ఉండే కేర‌ళ‌.. పంజాబ్ రాష్ట్రాల్లో బీజేపీకి త‌క్కువ సీట్లు వ‌చ్చాయ‌ని.. ఈ కార‌ణంతోనే వ‌య‌నాడ్ లో రాహుల్ విజ‌యం సాధించార‌ని చెప్పారు. అస‌ద్ మాట‌లు చూస్తే.. వ‌య‌నాడ్ లో రాహుల్ గెలుపు మోడీ వ్య‌తిరేక‌త కార‌ణ‌మే త‌ప్పించి.. మ‌రింకే ప్ర‌త్యేక‌త లేద‌న్న‌ట్లుగా ఉండ‌టం గ‌మ‌నార్హం. మొత్తానికి రాహుల్ గొప్ప‌త‌నాన్ని ఒప్పుకోవ‌టానికి అస‌ద్ సిద్ధంగా లేర‌న్న విష‌యం తాజా వ్యాఖ్య‌ను చూస్తే అర్థం కాక మాన‌దు.