Begin typing your search above and press return to search.
జేసీ బ్రదర్స్ కు రాహుల్ ఫోన్: టాక్ ఆఫ్ ది టౌన్
By: Tupaki Desk | 20 March 2021 8:30 AM GMTరాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీ అంతర్థానమైపోయింది. విభాజిత ఏపీలో భూస్థాపితం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఎంటో అందరికీ తెలుసు. దాదాపు ఏడేళ్లుగా ఏ ఎన్నికలు వచ్చినా రాజకీయ నాయకులకు ఉత్సాహం ఉంటే.. కాంగ్రెస్ వారికి మాత్రం భయం పుట్టుకొస్తోంది. ఎందుకంటే ఎలాగూ తాము గెలవం..దీంతో మిగతా పార్టీ నాయకులు కాంగ్రెస్ ను అనరాని మాటలు అంటున్నారు. దీంతో ఈ పార్టీలో ఉన్న నాయకులు తీవ్రంగా మానసిక వేదనకు గురవుతున్నారు. ఎంత ప్రయత్నించినా అటు తెలంగాణలో గానీ.. ఇటు ఏపీలో గానీ కాంగ్రెస్ కొంచెం కూడా పుంజుకోకపోవడంతో ఆ పార్టీ నాయకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
ఇటీవల ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేంది. అయితే అనంతపురం జిల్లాలో మాత్రం కాస్త తడపబడింది. మరీ ముఖ్యంగా జేసీ బ్రదర్స్ ఇలాకలో వైసీపీ ప్రతాపం చూపలేకపోయింది. దీంతో నైతికంగా వారు గెలిచామని జేసీ బ్రదర్స్ అనుకుంటున్నారు. ఈ విషయం జాతీయ ఛానెల్ వరకు వెళ్లడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్ కు రాహుల్ గాంధీ నుంచి ఫొన్ వచ్చిందని సమాచారం.
జేసీ బ్రదర్స్ కు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పాడు. దీంతో వారు ఆశర్యాన్ని వ్యక్తం చేశారట. అయితే తమకు అభినందలు వస్తున్నాయి గానీ.. రాహుల్ నుంచి రావడం ఎక్సైట్మెంట్ గా ఫీలయ్యారట. జేసీ బ్రదర్స్ తో రాహుల్ గాంధీకి ఇదివరకే చనువు ఉంది. వీరు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఫీడ్ బ్యాక్ నంతా రాహుల్ కు అందించేవారు. ఆ ఉద్దేశంతో ఇప్పుడు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు అని అనుకుంటున్నారు.
అయితే అంతేకాకుండా రాహుల్ ఫోన్ చేయడం వెనుక మరో మతలబు ఉన్నట్లు తెలుస్తోంది. జేసీ దివాకర్ రెడ్డి ఇటీవల తెలంగాణ అసెంబ్లీ భవనానికి వెళ్లి కాంగ్రెస్ నాయకులతో భోజనం చేశారు. 'ఇంకెంతకాలం ఉంటారు.. అల్టర్నేట్ చూసుకోపోయారా..?' అంటూ సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ నాయకులను రెచ్చగొట్టడానికేనన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్ లో ఇప్పటికీ నాయకులున్నారు గానీ.. యూనిటీ లేదన్న విషయం అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో జేసీ బ్రదర్స్ మరోసారి కాంగ్రెస్ పునరుద్దరణకు చర్యలు తీసుకోనున్నారా..? అన్న చర్చ సాగుతోంది.
జేసీ బ్రదర్స్ ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. ఏపీలో టీడీపీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీలో ఉంటే మనుగడ కష్టమేనని అనుకుంటున్నారు జేసీ బ్రదర్స్ . దీంతో వీరు మళ్లీ కాంగ్రెస్ లోకి జంప్ కొడుతారా..? అని టాక్ ఆఫ్ ది టౌన్. ప్రస్తుతం 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నందున ఇవి అయిపోగానే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పునరుద్ధరణకు రాహుల్ ప్రత్యేకంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.