Begin typing your search above and press return to search.

రాహుల్ కొత్త లుక్ వెనుక ఆంతర్యం ఏంటి ?

By:  Tupaki Desk   |   16 April 2020 9:31 AM GMT
రాహుల్ కొత్త లుక్ వెనుక ఆంతర్యం ఏంటి ?
X
రాహుల్ గాంధీ గత కొద్దిరోజులుగా మీడియాలో అసలు కనిపించడంలేదు. ఈ లాక్ డౌన్ విధించిన తరువాత కూడా ట్విట్టర్ ద్వారా ప్రభుత్వాన్ని ప్రశిస్తున్నారే తప్ప ఇప్పటివరకు బయటకి రాలేదు. కానీ , తాజాగా చాలా రోజుల తరువాత ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మీడియాతో మాట్లాడారు. అలాగే కరోనా కట్టడిలో భాగంగా బీజేపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విమర్శలు కురిపించారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి లాక్‌డౌన్‌ ఒక్కటే పరిష్కారం కాదని, . లాక్‌డౌన్‌ కేవలం కరోనా వ్యాప్తిని మాత్రమే అడ్డుకుంటుందని, ఆ తర్వాత మళ్లీ విజృంభించే అవకాశం ఉంది అని అన్నారు.

అయితే , ఈ విషయాన్ని పక్కన పెడితే ..చాలా రోజుల తరువాత మీడియా ముందుకు వచ్చిన రాహుల్ గాంధీని చూసి అందరూ షాక్ అవుతున్నారు. జుట్టుకి రంగు వేసి ,హెయిర్ స్టైల్ ను పూర్తిగా మార్చేశాడు. టక్కున చూస్తే ఎవరైనా ఒక్క క్షణం రాజీవ్ గాంధీ మళ్లీ మన ముందుకు వచ్చాడా అన్నంతలా కనిపించాడు. స్కైప్ ద్వారా మాట్లాడే వ్యక్తి అసలు మన రాహుల్ గాంధీనే అని గ్రహించడానికే చాలా సమయం పట్టింది అంటేనే అర్థం చేసుకోండి రాహుల్ గాంధీ మేకోవర్ ఎంతలా చేంజ్ చేసారో. అయితే , ఎన్ని చేసినా కూడా మాట్లాడే తప్పుడు తడబడటం మాత్రం మానలేదు.

అసలు కొత్త రాహుల్ గాంధీని చూసిన ప్రతి ఒక్కరు కూడా .. రాహుల్ తన రూపాన్ని ఇప్పుడు ఎందుకు మార్చాడు? ఇదే ఇప్పుడు రాజకీయ మరియు మీడియా వర్గాలలో చర్చనీయాంశమైంది. ఏదేమైనా కూడా రాహుల్ గాంధీ న్యూ లుక్ అదిరిపోయింది అని అందరూ చర్చించుకుంటున్నారు. కానీ , న్యూ లుక్ లాగే ..తన మాటల్లో కూడా కొత్తదనం చూపించాలని అయన అభిమానులు కోరుకుంటున్నారు.