Begin typing your search above and press return to search.
ఆ మూడింట్లో మోదీ సర్కార్ విఫలమైంది : రాహుల్ గాంధీ !
By: Tupaki Desk | 7 July 2020 1:00 PM ISTభారత్, చైనా మధ్య ఉద్రిక్తతల పై రాజకీయ దుమారం రేగుతోంది. భారత భూభాగంలోకి చైనా సైనికులు చొచ్చుకొచ్చారని..కానీ ప్రధాని మోదీ చోద్యం చూస్తున్నారని ఇటీవల సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఐతే కాంగ్రెస్‌కు అంతకు మించిన స్థాయి లో కౌంటర్ ఇచ్చింది బీజేపీ.
ఈ తరుణం లోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి మోడి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కరోనా వైరస్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైనట్లు రాహుల్ గాంధీ ఆరోపించారు. నోట్ల రద్దు, జీఎస్టీ అమలులో కూడా బిజెపి ప్రభుత్వం దారుణంగా విఫలమైనట్లు ఆయన విమర్శించారు. ఈ వైఫల్యాలపై భవిష్యత్తు లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అధ్యయనం చేయనున్నట్లు రాహుల్ వెల్లడించారు. భవిష్యత్తు లో ఇవే హెచ్ బీఎస్ కేస్ స్టడీలంటూ రాహుల్ ట్విట్టర్ లో మోడీ ప్రభుత్వాన్ని విమర్శించారు. తన పోస్టుకు ఓ వీడియోను కూడా పోస్టు చేశారు. ప్రధాని మోడి జాతిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తుంటే.. ఆ వీడియోలో వైరస్ కేసుల గ్రాఫ్ పెరుగుతూ పోతుంది. అలాగే 21 రోజుల్లో కరోనా పై విజయం సాధిస్తాం అని , చప్పట్లు కొట్టాలని , దీపాలు పెట్టాలని మోడీ చెప్పిన మాటలని గుర్తుచేశారు.